యాప్నగరం

రేణు దేశాయ్ వెబ్ సిరీస్.. ‘ఆహా’తో జతకట్టిన మాజీ హీరోయిన్!!

రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీని కోసం ఆమె ‘ఆహా’తో జతకట్టారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను తీర్చిదిద్దుతారట.

Samayam Telugu 30 Aug 2020, 12:03 pm
మరాఠి సినీ ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించిన తరవాత మళ్లీ టాలీవుడ్‌కు వచ్చిన రేణు దేశాయ్.. తాను తెలుగు సినిమాల్లో నటిస్తానని, నిర్మిస్తానని ఇప్పటికే చెప్పారు. అలాగే, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తానన్నారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాను అంగీకరించలేదు. ఒక సినిమాను నిర్మిస్తున్నానని చెప్పారు కానీ.. దాని వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే, తాజాగా రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్‌ను అంగీకరించినట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంతో జతకట్టారని టాక్.
Samayam Telugu రేణు దేశాయ్
Renu Desai


ఈ వెబ్ సిరీస్‌కు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వెబ్‌ సిరీస్‌ను ‘ఆహా’ నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రేణు దేశాయ్ అంగీకరించారని అంటున్నారు. మంచి కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందనుందని తెలిసింది. ప్రస్తుతానికి రేణు దేశాయ్ మాత్రమే ఖరారయ్యారని.. మిగిలిన నటీనటలు, టెక్నికల్ టీమ్ ఖరారైన తరవాత ‘ఆహా’ అధికారికంగా ప్రకటిస్తుందని చెబుతున్నారు.

Also Read: కాంబినేషన్ సెట్ అయ్యింది.. పవన్ కోసం మళ్లీ ఒక్కటైన ఇద్దరు దర్శకులు!

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ‘ఆహా’ ఒరిజినల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. కాగా, ఇది రేణు దేశాయ్‌కు తొలి వెబ్ సిరీస్ కానుంది. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రేణు దేశాయ్.. ఈ చిత్రం తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేశారు. ఆ తరవాత కొన్నేళ్లకు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2012లో పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన రేణు.. స్వస్థలం పుణే వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో సెటిలవ్వాలని చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.