యాప్నగరం

Bhola Shankar: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హాట్‌ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌..మెహ‌ర్ మెగా స్కెచ్‌

Megastar Chiranjeevi: మెగాస్టార్ తాజా చిత్రం భోళా శంక‌ర్ మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 21 Mar 2023, 11:59 am
Chiranjeevi - Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘భోలా శంకర్’ (Bhola Shankar) షూటింగ్‌‌లో పాల్గొంటున్నాడు. మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. కాగా.. ఈ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోది. అదేంటంటే.. ఇందులో ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో చిందేయ‌నుంద‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. మ‌లైకా అరోరా అని కూడా టాక్ గ‌ట్టిగానే వినిపిస్తోంది.
Samayam Telugu bhola shankar
bhola shankar, భోళా శంకర్


మ‌లైకా అరోరా తెలుగు స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌టం ఇదేమీ కొత్త కాదు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గ‌బ్బ‌ర్ సింగ్‌, మ‌హేష్ మూవీ అతిథి సినిమాల్లో మలైకా త‌న హాట్‌నెస్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మంట పెట్టేసింది. తాజాగా మ‌రోసారి ఈ అమ్మ‌డు అందాల‌తో విందు చేయ‌నుందని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే మాత్రం ఈ సాంగ్‌లో నటించ‌టానికి ఈ హాట్ బ్యూటీ గ‌ట్టిగానే వ‌సూలు చేస్తుంది. మెహ‌ర్ ర‌మేష్ చాలా గ్యాప్ త‌ర్వాత డైరెక్ట్ చేస్తోన్న ఈ భోళా శంక‌ర్ మూవీపై ఎలాంటి అవ‌కాశాన్ని వ‌దులుకోవాల‌ని అనుకోవ‌టం లేదు. అందులో భాగంగానే మ‌లైకాతో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్‌చేశారంటున్నాయి మీడియా వ‌ర్గాలు.

భోళా శంక‌ర్‌లో తమన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించనుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ మొదటిసారి మెగాస్టార్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర్ భోలా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాలని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) మూవీతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. చిరంజీవి వింటేజ్ లుక్, రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కాగా.. మెగాస్టార్ అభిమానులకు సంక్రాంతికి సీజన్‌కు ఫుల్ ఫీస్ట్ అందించింది.

ALSO READ: Kota Srinivasa Rao: కోటను కూడా చంపేశారు కదరా!.. పాపం ఇదెక్కడి ఖర్మరా బాబూ!
ALSO READ: Pawan Kalyan: ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’లో ప్రభాస్ హీరోయిన్.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మ‌ల‌యాళ‌ బ్యూటీ

ALSO READ: Suriya: ముంబైలో ఖరీదైన ఇల్లు కొన్న హీరో సూర్య‌.. వామ్మో అని కోట్లా!

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.