యాప్నగరం

Acharya: చిరంజీవి- రామ్ చరణ్ మధ్య ఆస్తి తగాదా.. డీల్ చేస్తున్న కొరటాల శివ! ఇదీ మ్యాటర్

చిరంజీవి- రామ్ చరణ్ మధ్య ఆస్తి తగాదా చోటు చేసుకోగా దాన్ని తన చాతుర్యంతో కొరటాల డీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఏంటి.. మెగా హీరోల మధ్య ఆస్తి తగాదాలా? అసలు మ్యాటర్ లోకి పోతే..

Samayam Telugu 15 Jun 2020, 4:44 pm
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య నెలకొన్న ఆస్తి తగాదాను ఆసక్తికరంగా డీల్ చేస్తున్నారట కొరటాల శివ. తన టాలెంట్ అంతా ఉపయోగించి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారట. ఏంటి.. అర్థం కాలేదా? ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదా తాలూకు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట కొరటాల.
Samayam Telugu చిరంజీవి- రామ్ చరణ్ మధ్య ఆస్తి తగాదా.. డీల్ చేస్తున్న కొరటాల శివ! ఇదీ మ్యాటర్
Chiranjeevi Ram Charan


చిరంజీవి 152వ సినిమాగా 'ఆచార్య' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ సైతం కనిపించి మెగా అభిమానులను హుషారెత్తించనున్నారు. ఇందులో చెర్రీ పాత్ర దాదాపు అర్థగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్న కొరటాల.. చిరంజీవి- రామ్ చరణ్ మధ్య రక్తి కట్టించే సన్నివేశాలను ప్లాన్ చేశారట.

Also Read: ఈ ఏడాదే సుశాంత్ పెళ్లి.. ఇంతలో ఘోరం! మరణం తర్వాత బయటపడుతున్న వాస్తవాలు

చిత్రంలో దేవాదాయ శాఖ అధికారిగా చిరంజీవి కనిపించనుండగా, నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నక్సలైట్‌ అయిన రామ్‌ చరణ్‌ను చిరంజీవి పట్టుకునే క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ ఉండేలా కథ రాసుకున్నారట డైరెక్టర్ కొరటాల. అయితే ఈ ఫైట్ దేవాదాయ భూముల ఆస్తుల గురించి జరుగుతుందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

'సైరా' షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన క్రమంలో చిరంజీవి కోసం చాలాకాలం ఎదురుచూసిన కొరటాల శివ.. దొరికిన సమయమంతా కథను సానపట్టేందుకు ఉపయోగించి చివరకు అద్భుతమైన ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసుకున్నారట. ఈ కథను సెట్స్ మీదకు తెచ్చాక లాక్‌డౌన్ రావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. రీసెంట్‌గా షూటింగ్ పర్మిషన్స్ రావడంతో అతిత్వరలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు కొరటాల. ఇక ఈ చిత్రంలో చిరు సరసన మరోసారి కాజల్ రొమాన్స్ చేయనుండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.