యాప్నగరం

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టాప్ డైరెక్టర్!

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ త్వరలోనే హాలీవుడ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. వాల్ డిస్నీ సంస్థ నిర్మించే ఓ సినిమా కోసం ఆయన పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 2 Dec 2020, 11:59 am
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి పాపులర్ అయిన డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. అయితే కొంతకాలంగా ఆయన తదుపరి సినిమాపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం మురుగదాస్ హాలీవుడ్‌ సంస్థ కోసం పనిచేయనున్నాడట. అదికూడా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ కోసమట.
Samayam Telugu మురుగదాస్


Also Read: నాన్న మూడెకరాలు అమ్మిన చోటే నేను పదెకరాలు కొన్నా: హైపర్ ఆది

హాలీవుడ్‌లో లైవ్ యాక్షన్‌ ట్రెండ్‌లో ఓ సినిమాను రూపొందించాలనేది మురుగదాస్‌ ఆలోచనగా ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తుపాకీ, కత్తి, సర్కార్.. చిత్రాల తర్వాత విజయ్‌తో ఆయన మరో సినిమా తెరకెక్కించేందుకు మురుగదాస్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. దీంతో ఆయన హాలీవుడ్‌ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: నిహారిక-చైతన్య వెడ్డింగ్ కార్డ్... మెగా ఫ్యామిలీ హోదాకు తగినట్లుగానే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.