యాప్నగరం

మెగాస్టార్ ఆఫర్‌ను తిరస్కరించిన హరీష్ శంకర్.. కారణం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి చేయబోయే ‘లూసిఫర్’ రీమేక్‌పై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. వాటిలో ఇదీ ఒకటి.

Samayam Telugu 19 Nov 2020, 9:03 pm
డైరెక్టర్ హరీష్ శంకర్ టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కమర్షియల్ ఫార్ములా అంటే ఏంటో తెలిసిన దర్శకుడు ఆయన. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేసి కమర్షియల్ హిట్లు కొట్టారు హరీష్. ‘గబ్బర్ సింగ్’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలే దీనికి ఉదాహరణలు. ఈ రెండు సినిమాలతో హరీష్ శంకర్ రీమేక్ స్పెషలిస్టుల జాబితాలో చేరిపోయారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు హరీష్ శంకర్‌కు ఇద్దామని భావించారట. కానీ, హరీష్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారని టాక్.
Samayam Telugu చిరంజీవి, హరీష్ శంకర్
Chiranjeevi and Hairsh Shankar


మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను రామ్ చరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను మొదట ‘సాహో’ దర్శకుడు సుజీత్‌కు అప్పగించారు. అయితే, మలయాళం స్క్రిప్ట్‌లో మార్పులు చేసి సుజీత్ తయారుచేసిన తెలుగు స్క్రిప్ట్ చిరంజీవిని ఆకట్టుకోలేకపోయిందట. దీంతో ఈ సినిమా బాధ్యతను తరవాత వి.వి.వినాయక్‌కు చిరంజీవి అప్పగించారని వదంతులు వచ్చాయి. అయితే, చిరంజీవితో రెండు రీమేక్ హిట్‌లు కొట్టిన వినాయక్ కూడా తన స్క్రిప్ట్‌తో ఇప్పుడు మెగాస్టార్‌ను మెప్పించలేకపోయారట.

వినాయక్ స్క్రిప్ట్ కూడా నచ్చకపోవడంతో హరీష్ శంకర్‌కు ఛాన్స్ ఇవ్వాలని చిరంజీవి భావించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. కానీ, చిరంజీవి ఆఫర్‌ను హరీష్ శంకర్ సున్నితంగా తిరస్కరించారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్‌పై హరీష్ శంకర్ పనిచేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత పవన్‌తో హరీష్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. అందుకనే, ఈ స్క్రిప్ట్‌పై హరీష్ చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కాబట్టి, ‘లూసిఫర్’ స్క్రిప్ట్‌పై పనిచేసేటంత ఖాళీ హరీష్ శంకర్ లేదు. ఇదే కారణాన్ని చిరంజీవికి హరీష్ చెప్పారట. ఇంతకీ ఇదంతా రూమర్ మాత్రమే. దీనిలో నిజమెంతో కాలమే చెప్పాలి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.