యాప్నగరం

మంచి అవకాశాన్ని కోల్పోయిన శివాత్మిక రాజశేఖర్.. ఆ రీమేక్ సినిమాలో ఆమె ప్లేస్‌లో మలయాళ నటి

హీరో రాజశేఖర్ తనయ శివాత్మిక తొలి సినిమా దొరసానితోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే రీసెంట్‌గా ఓ మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట ఈ బ్యూటీ.

Samayam Telugu 8 Aug 2021, 7:19 pm
ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు హీరో రాజశేఖర్. ఆయన చేసే పాత్రలను చూసి ఆయనకి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరు పెట్టేశారు ప్రేక్షకులు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు ఆయన. అయితే ఆయన నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్. 2019లో వచ్చిన ‘దొరసాని’ అనే సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Samayam Telugu శివాత్మిక రాజశేఖర్
Shivatmika RajaShekar


కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు.. ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది శివాత్మిక. ప్రస్తుతం ఆమె తెలుగులో పలు సినిమాలు చేస్తూనే.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే కొన్ని అనుకొని కారణాల వల్ల.. ఓ మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట శివాత్మిక. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన కప్పెల మూవీని డెబ్యూ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ టీ రమేశ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నల గడ్డ, అర్జున్‌ దాస్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా శివాత్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట. అయితే ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆమె స్థానంలో ఈ మూవీలో హీరోయిన్‌గా మలయాళ నటి అనికా సురేంద్రన్‌ను మేకర్స్‌ ఖరారు చేశారట. దీంతో శివాత్మిక మంచి అవకాశాన్ని చేజార్చుకుంది అంటూ చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పంచతంత్రం’ అనే సినిమాతో పాటు.. ‘ఆనందం విలయదుం వీడు’ అనే మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.