యాప్నగరం

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబో.. మెగా అభిమానులు పండగ చేసుకునే అప్‌డేట్!

రీ ఎంట్రీ ఇస్తూ ఇస్తూనే వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. 'వకీల్ సాబ్' చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో మూవీ కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

Samayam Telugu 27 Apr 2020, 2:36 pm
Samayam Telugu పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబో
Pawan Kalyan
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మెగా అభిమానులకు అదో పండగ. అలాంటిది ఆయన మల్టీస్టారర్ మూవీ అంటే వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు. అది కూడా ఇతర భాషకు చెందిన మరో హీరోను భాగం చేయడమంటే ఇక కన్నుల పండగే. సరిగ్గా అల్లాంటి పనే చేస్తున్నారట డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్‌తో తాను చేయబోతున్న కొత్త సినిమా కోసం భారీ స్కెచ్ వేశారట క్రిష్. మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఆయన ప్లాన్ చేశారని తెలుస్తోంది.

తన 26వ సినిమాగా పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ జానపద నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ డ్రామా అని తెలిసింది. కోహినూర్ వజ్రం దొంగలించే దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో హీరోగా భాగం కానున్నారని లేటెస్ట్ టాక్.
ఇందులో ఓ కీలక పాత్ర కోసం తమిళ హీరో శివ కార్తికేయన్‌ను తీసుకున్నారని, అంతేకాదు ఆయన పాత్ర పరిధిని మరింత పెంచి మల్టీస్టారర్ రేంజ్‌లో ఈ మూవీ రూపొందించేలా క్రిష్ సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం బయటకొచ్చింది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. ఈ న్యూస్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రీ ఎంట్రీలో పవన్ మల్టీస్టారర్, అది కూడా క్రిష్ దర్శకత్వంలో అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ క్రిష్ ఈ టైటిల్‌ను ఫిలించాంబర్లో రిజిస్టర్ చేయించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. చూద్దాం మరి పవన్- క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.