యాప్నగరం

SSMB 28 Title: జగన్ ప్రభుత్వ పథకమే.. మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్.? ‘అమ్మఒడి’ తో వైసీపీలో ఉత్సాహం!!

Jagananna Ammavodi: ‘అమ్మఒడి’ ఎంత మంచి పదం ఇది.. అందుకే ఈ పదాన్ని తన ప్రభుత్వ పథకానికి పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదే టైటిల్‌తో మహేష్ బాబు కొత్త సినిమా రాబోతుందనేది లేటెస్ట్ అప్డేట్..

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 21 Mar 2023, 2:43 pm
SSMB28 Movie: మహేష్ బాబు, వైఎస్ జగన్‌లకు కోస్తా జిల్లాల్లో కామన్ ఫ్యాన్స్ ఉంటారు. ఎక్కడ చూసినా.. ఓ వైపు జగన్ ఫొటో.. మరో వైపు మహేష్ బాబు ఫొటోలు కనిపిస్తాయి ఫ్లెక్సీలలో. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో అయితే.. మహేష్ బాబు సినిమా వచ్చిందంటే.. తమ అభిమాన హీరో మహేష్ బాబు ఫొటోతో పాటు.. సీఎం జగన్ ఫొటోలు కూడా వేస్తుంటారు చాలామంది. జగన్ అంటే మహేష్ బాబు.. మహేష్ బాబు అంటే జగన్ అన్నట్టుగా హడావిడి చేస్తుంటారు.
Samayam Telugu mahesh babu ammavodi movie
మహేష్ బాబు అమ్మఒడి


అయితే ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వ పథకమే. మహేష్ బాబు సినిమాకి టైటిల్ అయితే ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా ఉండదు మరి. చాలామందికి మబ్బులిడిపోతాయంతే. ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో SSMB28 కొత్త సినిమా రాబోతుంది. ‘అతడు’ సినిమాతో మహేష్ బాబు‌కి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ‘ఖలేజా’ సినిమాతో ఫ్లాప్ రుచి చూపించారు. ఓ హిట్టు.. ఓ ఫ్లాప్‌తో లెక్క సమం చేసి.. ఇప్పుడు మళ్లీ మహేష్ బాబుతో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధం చేశారు.

అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ.. ‘అమ్మఒడి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అమ్మ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుండటంతో ఉగాది కానుకగా ఈ టైటిల్‌ని రివీల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, అతడు, అఆ.. ఇవన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రాలు. ఈ సినిమాలన్నీ ‘అ’ అక్షరంతో మొదలయ్యాయి. ఇదే సెంటిమెంట్‌ని మహేష్ బాబు సినిమాకి కూడా రిపీట్ చేయబోతున్నారట త్రివిక్రమ్. మొదట్లో ‘అయోధ్య‌లో అర్జునుడు’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ.. ‘అమ్మఒడి’ అయితేనే కథకి కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంలో ఉన్నారట.

పైగా మహేష్ బాబుకి వైఎస్ జగన్‌కి కామన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ టైటిల్ పెడితే బాగుంటుందనే అభిప్రాయంలో మహేష్ బాబు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే ‘అమ్మఒడి’ పథకంతో జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అమ్మ ఒడితో పాటుగా.. విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు, గోరుముద్ద.. రీసెంట్‌గా ‘జగనన్న గోరుముద్ద - రాగి జావ’ పథకాల ద్వారా విద్యారంగంలో ప్రగతిశీల అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. అయితే ఇప్పుడు మహేష్ బాబు మూవీకి జగన్ ప్రభుత్వ పథకం ‘అమ్మఒడి’ పేరు పెడితే అది రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్కే అనొచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే.. మహేష్ బాబు మూవీకి ‘అమ్మఒడి’ టైటిల్‌ పెట్టడానికి అసలు త్రివిక్రమ్ ఒప్పుకోరనేది.

ఇది ఖచ్చితంగా రూమరే అయ్యి ఉంటుందని.. ఓ వైపు పవన్ కళ్యాణ్‌కి అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్.. రాజకీయంగానూ తెరవెనుక చక్రం తిప్పుతుంటారనే టాక్ ఉంది. పవన్ కళ్యాణ్‌ స్పీచ్‌లన్నీ త్రివిక్రమ్ కలం నుంచి వెళ్లినవే అనేది చాలామంది అనేమాట. ఇలాంటి పరిస్థితుల్లో.. మహేష్ బాబు సినిమాకి.. జగన్ ప్రభుత్వ పథకమైన ‘అమ్మఒడి’ టైటిల్ పెడతారంటే డౌటానుమానమే.

ఇకపోతే.. మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ28 చిత్రంలో సైతం.. తనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ పూజా హెగ్డేనే రిపీట్ చేస్తున్నాడు గురూజీ. ఆమెతో పాటుగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీలను సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్నారు. థమన్ దరువు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ సినిమా 2023 ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.