యాప్నగరం

దీపావళి బరిలో కమల్, రజనీ.. ఒకేసారి ఇద్దరు సినిమాల విడుదల.. ఫ్యాన్స్‌కి ఇక పండుగే..

సూపర్‌స్టార్ రజనీ కాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోంది. చాలా సందర్భాల్లో వీరిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. ఈ ఏడాది దీపావళికి వీరిద్దరి సినిమాలు తలపడనున్నాయి.

Samayam Telugu 10 Apr 2021, 9:13 pm
సూపర్‌స్టార్ రజనీ కాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కోలీవుడ్‌కి రెండు కళ్లు. మంచి స్నేహితులుగా ఉండే వీరిద్దరి మధ్య సినిమాల విషయంలో ఎప్పటి నుంచో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తుండగా.. కమల్ లోకేశ్ నాగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలను దీపావళి బరిలో దింపాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu రజనీకాంత్ మరియు కమల్‌హాసన్
Rajnikanth And Kamal Hassan


అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇదే నిజమై అన్నాత్తే, విక్రమ్ సినిమాలు ఒకే రోజు విడుదలైతే.. ఫ్యాన్స్‌కి అది ఓ పండగలా మారుతుంది. ‘అన్నాత్తే’ సినిమాలో రజనీకాంత్ ఓ గ్రామపెద్ద పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోవైపు ‘విక్రమ్’ సినిమాలో కమల్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారంటూ రూమర్స్ వస్తున్నారు. ఇప్పటికే రజనీ, కమల్‌లు వారివారి సినిమాల షూటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

అయితే అనుకున్న సమయానికి షూటింగ్‌లు, మిగితా పనులు పూర్తైతే.. ఈ సినిమాలు ఏకకాలంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు దాదాపు 16 సంవత్సరాల తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం ఉంది. వీరిద్దరు నటించిన చంద్రముఖి, ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాలు 2005 తమిళ సంవత్సరాదికి ఏకకాలంలో విడుదల అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.