యాప్నగరం

Power Star: రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన పవర్ స్టార్! దిమ్మతిరిగింది!! ఇదీ అసలు సంచలనం

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'పవర్ స్టార్' పట్టాలెక్కడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్‌గా నటించబోయే నటుడు నో చెప్పడమే ఇందుకు కారణం అంటున్నాయి మీడియా వర్గాలు.

Samayam Telugu 6 Jul 2020, 3:21 pm
సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చారట జూనియర్ పవర్ స్టార్. అదేనండీ అర్థం కాలేదా! ఆయన రూపొందించబోతున్న 'పవర్ స్టార్' సినిమాలో నటించబోయే నటుడు హ్యాండిచ్చాడట. ఈ సినిమాలో నటించడం కుదరదని తెగేసి చెప్పేశాడట. దీంతో వర్మకు దిమ్మతిరిగి పోయిందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన పవర్ స్టార్! దిమ్మతిరిగింది!! ఇదీ అసలు సంచలనం
Rgv Power star


'పవర్ స్టార్' పేరుతో సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటన చేయగానే సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా ఈ మూవీ చేస్తున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే పవర్ స్టార్ అంటూ ఓ వ్యక్తిని చూపిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉండటం మరింత ఆసక్తి రేకెత్తించింది.

Also Read: పెళ్లయ్యాక మొదటి ఆరు నెలలు.. అతనితో ఆ 21 రోజులే.. పర్సనల్ మ్యాటర్స్ రివీల్ చేసిన అనుష్క

దీంతో ఆ వ్యక్తి ఎవరనే దానిపై ఆరాదీసిన మీడియా వర్గాలు.. ఆయన భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం ఆ వ్యక్తి 'పవర్ స్టార్' సినిమాలో నటించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే ఈ మూవీ నుంచి తప్పుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వర్మకు ఊహించని షాక్ తగిలిందని, ఆయన ఈ ప్రాజెక్టును నిలిపి వేస్తున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. సో.. చూడాలి మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారనేది!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.