యాప్నగరం

ఎన్టీఆర్ సినిమాలో మరోసారి రమ్యకృష్ణ.. అలా సెట్టయ్యిందట!!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ముచ్చటగా మూడోసారి రమ్యకృష్ణ నటించబోతున్నారని సమాచారం. మాటల మాంత్రికుడు ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారని అంటున్నారు.

Samayam Telugu 20 Sep 2020, 8:09 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఆప్‌డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తూనే ఉంటారు. ప్రస్తుతం RRR మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉంటారో చూడాలనే ఆత్రుత సినిమా ప్రియులు అందరిలోనూ ఉంది. అయితే, ఆ టైమ్ ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరికీ తెలీదు. ఇదిలా ఉంటే, RRR తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను ఎన్టీఆర్ లైన్‌లో పెట్టారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకున్నారని సమాచారం.
Samayam Telugu ఎన్టీఆర్, రమ్యకృష్ణ
Jr NTR, Ramya Krishnan


గతంలో వెండితెరను ఏలిన హీరోయిన్లను ఇప్పుడు పవర్‌ఫుల్ రోల్స్‌లో త్రివిక్రమ్ చూపిస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో నదియాను, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూని కీలక పాత్రల్లో చూపించారు త్రివిక్రమ్. అలాగే, ఈ ఏడాది వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’లో టబును కీలక పాత్రలో చూపించారు. ఇప్పుడు అలాంటి పాత్ర కోసమే రమ్యకృష్ణను తీసుకొస్తున్నారట త్రివిక్రమ్. కాబట్టి, ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌తో ఇప్పటికే రెండు సార్లు కలిసి నటించారు రమ్యకృష్ణ. ‘సింహాద్రి’లో ‘చిన్నదమ్మే చీకులు కావాలా’ అంటూ ఎన్టీఆర్‌తో మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన రమ్యకృష్ణ.. ఆ తరవాత ‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌కు అత్తగా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తారని సమాచారం. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.