యాప్నగరం

Ravi Teja: నిధి అగర్వాల్, రాశిఖన్నాలతో రవితేజ రొమాన్స్.. మనోడు భలే కిలాడీలే!!

మాస్ మహారాజ్ తన లేటెస్ట్ ప్రాజెక్టును డైరెక్టర్ రమేష్ వర్మతో కమిట్ అయ్యారు. ఈ సినిమాకు కిలాడీ అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్న మేకర్స్.. రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ లను హీరోయిన్లుగా తీసుకోబోతున్నారట.

Samayam Telugu 11 Aug 2020, 2:06 pm
విజయం, అపజయం సంగతి అటుంచితే వరుస సినిమాలతో వెండితెరపై హంగామా చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఇటీవలే తన 'క్రాక్' సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన రవితేజ.. ఈ లాక్‌డౌన్ వేళ మరొకొన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేశారని తెలుస్తోంది. అందులో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా కథకు రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న మేకర్స్.. తాజాగా టైటిల్, హీరోయిన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట.
Samayam Telugu నిధి అగర్వాల్, రాశిఖన్నాలతో రవితేజ రొమాన్స్.. మనోడు భలే కిలాడీలే!!
Raviteja with Nidhi Agarwal


రమేష్ వర్మ- రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో హీరో రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. అందుకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందట. నేటితరం అభిమానులు కోరుకునే విధంగా ఆ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో హాట్ బ్యూటీలు రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ లను హీరోయిన్లుగా ఫైనల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

Also Read: Kangana Ranaut: ఆ హీరోని ఎవ్వరూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయలేరు కానీ..! రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్

ఇకపోతే ఈ మూవీకి మాస్ టైటిల్ 'కిలాడీ'ని ఫైనల్ చేయాలని ఫిక్స్ అయ్యారట దర్శకనిర్మాతలు. ఈ టైటిల్‌పై రవితేజ కూడా ఇంట్రెస్ట్ చూపడంతో ఇదే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు లేటెస్ట్ మూవీ 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.