యాప్నగరం

నానితో మరోసారి.. సాయిపల్లవికి షాకింగ్ రెమ్యూనరేషన్?

నేచురల్ నానితో తాజా సినిమా ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

Samayam Telugu 18 Sep 2020, 3:04 pm
అద్భుత నటనతో, డ్యాన్సులతో దక్షిణాది సినీ తెరపై తిరుగులేని గుర్తింపు తెచ్చుకంది సాయిపల్లవి. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ అమ్మడు తన టాలెంట్‌నే నమ్ముకుని దూసుకుపోతోంది. ‘ఫిదా’తో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవికి ఆ తర్వాత వరుస అవకాశాలు చుట్టుముట్టినా తొందరపడలేదు. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపిస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది.
Samayam Telugu సాయిపల్లవి


Also Read: శ్రావణికి డబ్బులిచ్చిన అశోక్‌రెడ్డి.. దానికి ఒప్పుకోకపోవడంతో నరకం చూపిస్తూ

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య పక్కన ‘లవ్‌స్టోరీ’లో నటిస్తోంది సాయిపల్లవి. తాజాగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా సాయిపల్లవిని మెయిన్ హీరోయిన్‌‌గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని తీసుకోనున్నట్లు సమాచారం. సాయిపల్లవి గతంలో ‘ఎంసీఏ’ సినిమాలో నాని పక్కన నటించింది.

Also Read: మోదీ బయోపిక్ ‘మనో విరాగి’... బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన యూనిట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.