యాప్నగరం

హీరోగా సింగర్ సునీత కుమారుడు.. రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు!!

సునీత కొడుకు ఆకాష్.. ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే హీరోగా ఆకాష్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయని ఇన్‌సైడ్ టాక్.

Samayam Telugu 31 Jan 2022, 3:55 pm
టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడిన ఆమె, ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ టైమ్ సరదాగా గడుపుతోంది. అయితే ఇది సునీతకు రెండో వివాహం అనే సంగతి మనందరికీ తెలుసు. గత కొన్నేళ్ల క్రితమే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. తన కుమారుడు, కూతురి బాధ్యతలు చూసుకుంటూ ఇద్దరినీ పెంచి పెద్ద చేసింది. ఆ ఇద్దరే దగ్గరుండి మరీ సునీతకు రెండో వివాహం జరిపించారని విన్నాం.
Samayam Telugu హీరోగా సింగర్ సునీత కుమారుడు
Singer Sunitha


ఇదిలాఉంటే సునీత కొడుకు ఆకాష్.. ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆకాష్ హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయని ఇన్‌సైడ్ టాక్. సునీత కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది.
Samantha : నాకే కాదు..నా భ‌ర్త‌కు స‌మంత హాట్‌గా అనిపించింది : ప్రియ‌మ‌ణి
ఇకపోతే ఆకాష్ ఇప్ప‌టికే త‌న చ‌దువును పూర్తి చేసుకుని న‌ట‌న‌లో మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం. ఇండస్ట్రీ పరంగా అటు సునీతకు, ఇటు రామ్ వీరపనేనికి మంచి సంబంధాలున్న కారణంగా ఆకాష్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం వస్తే గానీ ఈ వార్తల్లో నిజమెంత? సునీత నిజంగానే కొడుకును హీరో చేయాలని భావిస్తోందా? అనేది చెప్పలేం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.