యాప్నగరం

నయనతార మెయింటనెన్స్‌.. ‘మావల్ల కాదు’ అంటోన్న నిర్మాతలు

సౌత్‌లో ప్రస్తుతం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. నిజానికి ఈ జాబితాలో నయనతార మొదటి వరుసలో ఉంటారు. అయితే, రెమ్యునరేషన్‌‌తో పాటు నయనతార అదనపు ఖర్చులు నిర్మాతలకు భారంగా మారుతున్నాయట.

Samayam Telugu 23 Feb 2020, 4:36 pm
నయనతార ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు నయన్. కిందటేడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించారు. వాటిలో ‘సైరా’, ‘బిగిల్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇంకా మూడు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయి.
Samayam Telugu Nayanthara
నయనతార


ఇదిలా ఉంటే, గత కొద్ది నెలలుగా తమిళనాట నయనతారపై ఒక నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. నయనతారను తట్టుకోవడం తమిళ నిర్మాతల వల్ల కావడంలేదట. అంటే, మెయింటనెన్స్ పరంగా. నయనతారకు ఇచ్చే పారితోషికంతో పాటు ఆమె మెయింటనెన్స్‌కు కూడా బాగా ఎక్కువ ఖర్చు అవుతోందట. నయనతార టీం ఐదు నుంచి ఆరుగురు ఉంటారని సమాచారం. వీరంతా ఆమెతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారట. నయనతారతో పాటు వాళ్లకు ఫ్లైట్ టిక్కెట్లు, హోటల్ రూమ్స్, సెట్స్‌లో వాళ్లకు అయ్యే ఖర్చు అంతా కలిసి తడిసి మోపెడు అవుతోందట.

Also Read: అబ్దుల్ ఖాలిక్‌గా మారిన హీరో శింబు

కాబట్టి, ఈ విషయంలో ఇక నోరుమూసుకుని ఉండకూడదని తమిళ నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు అక్కడి మీడియా ద్వారా వచ్చిన సమాచారం. ఎలాగైనా నయనతార టీంకు చెక్ పెట్టాలని.. పారితోషికంతో పాటు అదనపు ఖర్చుల గురించి ఆమెతో అంతా కలిసి ఒకసారి మాట్లాడాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎక్కడికి బడితే అక్కడికి నయన్‌తో పాటు ఆమె టీంను అనుమతించకుండా చేయాలని చూస్తున్నారట. అత్యవసర సమయాల్లో మాత్రమే తనతో పాటు టీంను వెనుక తీసుకొచ్చే అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.