ఇషాన్ ఖట్టర్... బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు సవతి సోదరుడు. త్వరలోనే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. అయితే కుర్రాడు ఆసక్తికరమైన రీతిలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తో సాన్నిహిత్యంగా కనిపిస్తున్నాడు ఇషాన్. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారు. త్వరలోనే జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి సాన్నిహిత్యం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా‘బేవాచ్’ సినిమా చూడటానికి వీరిద్దరూ కలిసి వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో షికారు చేస్తున్నాయి. ఇషాన్, జాన్వీలు డేటింగ్ లో ఉన్నారనే.. సన్నిహితులయ్యారనే ప్రచారానికి ఈ ఫొటోలు ఊతం ఇస్తున్నాయి.
మరింత విశేషం ఏమిటంటే.. జాన్వీతో ఇషాన్ సాన్నిహిత్యాన్ని షాహిద్ కపూర్ వ్యతిరేకిస్తున్నాడట. ఇఫ్పటికే ఈ విషయంలో ఇషాన్ ను షాహిద్ హెచ్చరించడం కూడా జరిగిందట. అయినప్పటికీ ఆ కుర్రాడు జాన్వీతో షికార్లు చేస్తూ అందరి కంటా పడుతున్నాడు. మరోవైపు శ్రీదేవి కూడా కూతురిపై జరుగుతున్న ఈ ప్రచారం పట్ల అసహనంతోనే ఉందని సమాచారం.