యాప్నగరం

Godse OTT Release: గాడ్సే ఓటీటీ సందడికి రెడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Satyadev: వర్సటైల్ యాక్టర్ స‌త్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన రీసెంట్ మూవీ గాడ్సే (Godse). జూన్‌ 17న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 14 Jul 2022, 12:51 pm
ఒకవైపు డిఫరెంట్ రోల్స్ చేస్తూ.. మరోవైపు హీరోగా తనదైన శైలిలో ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు నటుడు స‌త్యదేవ్‌ (Satyadev). ఆయన టైటిల్ రోల్‌లో నటించిన రీసెంట్ మూవీ గాడ్సే (Godse). జూన్‌ 17న థియేటర్ల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రాజకీయాలపై ఓ అస్త్రంగా డైరెక్టర్ గోపి గ‌ణేష్ పట్టాభి ఈ మూవీని తెరకెక్కించారు. స్పెష‌ల్ ఆఫీస‌ర్ క్యారెక్టర్‌లో ఐశ్వర ల‌క్ష్మీ మెప్పించగా.. నాగబాబు (Nagababu) కీలక పాత్రలో నటించారు. బిగ్ స్ర్కీన్లపై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా.. ఓటీటీలో (Godse OTT) సందడి చేసేందుకు రెడీ అయింది.
Samayam Telugu ఓటీటీ సందడికి గాడ్సే మూవీ రెడీ


ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన నెల రోజులకు ఓటీటీలో వచ్చేలా ముందే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం నెట్ ఫ్లిక్స్‌లో గాడ్సే మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ఆడియన్స్.. ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 'గుర్తుందా శీతకాలం' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.