యాప్నగరం

కార్‌ను స్టార్ట్ చేసే మొబైల్ యాప్!

స్మార్ట్‌ఫోన్ సహాయంతో కార్‌ను స్టార్ట్ చేసే టెక్నాలజీని జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ టొయోటా అభివృద్ధి చేసింది.

TNN 1 Nov 2016, 7:28 pm
స్మార్ట్‌ఫోన్ సహాయంతో కార్‌ను స్టార్ట్ చేసే టెక్నాలజీని జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ టొయోటా అభివృద్ధి చేసింది. ఈ మేరకు ‘స్మార్ట్ కీ బాక్స్’ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేసింది. దీని సాయంతో కార్‌ను స్టార్ట్ చేయడంతో పాటు మరికొన్ని సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. కార్ల షేరింగ్, అద్దెకు కార్లను ఇచ్చే వారి సంరక్షణ కోసం మాత్రమే ప్రస్తుతం దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు టొయోటా ప్రకటించింది.
Samayam Telugu toyota develops app to start up car from smartphone
కార్‌ను స్టార్ట్ చేసే మొబైల్ యాప్!

టొయోటా దీన్ని పైలట్ ప్రోగ్రాం కింద జనవరిలో సాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభించింది. ఆన్‌లైన్ కార్ షేరింగ్ కంపెనీ ‘గెటరౌండ్’లో దీన్ని అభివృద్ధి చేశారు. తమ కార్లను ఉపయోగించని వారు ఈ వెబ్‌సైట్ ద్వారా ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు. క్లౌడ్ సర్వీస్‌ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ పనిచేస్తుంది. కారులో ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సర్వీసును కల్పిస్తామని టొయోటా చెపుతోంది. ఈ యాప్‌తో డోర్ లాక్ ఓపెన్ చేయడం, ఇంజన్ స్టార్ట్ చేయడం వంటివి చేయొచ్చని వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.