యాప్నగరం

లేటు వయస్సులో లేటెస్టుగా: 52 దేశాలు రోడ్ ట్రిప్!

సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు దేశాలు చుట్టిరావాలంటేనే చాలా కష్టం. అదీ.. రోడ్ ట్రిప్ అంటే మాటలు కాదు. అలాంటిది ఈ దంపతులు.. లేటు వయస్సులో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో 52 దేశాలు చుట్టేశారు.

TNN 5 May 2017, 4:24 pm
సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు దేశాలు చుట్టిరావాలంటేనే చాలా కష్టం. అదీ.. రోడ్ ట్రిప్ అంటే మాటలు కాదు. అలాంటిది ఈ దంపతులు.. లేటు వయస్సులో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో 52 దేశాలు చుట్టేశారు. అంతటితో ఆగిపోయారని అనుకుంటే పొరపాటే. వారి జర్నీని మరిన్ని దేశాలకు కొనసాగిస్తున్నారు. అంతేకాదండోయ్ ఓ చారిటీ కోసం కూడా నిధులు సేకరిస్తున్నారు. వారు ఎంత దూరం ప్రయాణిస్తే అన్ని కిమీలకు రూ.10 చొప్పున స్వచ్ఛంద సంస్థలకు లభిస్తాయి.
Samayam Telugu 52 countries in 8 months this retired couple is in no mood to quit
లేటు వయస్సులో లేటెస్టుగా: 52 దేశాలు రోడ్ ట్రిప్!


ముంబయికి చెందిన లూయీస్(61), జనెట్ డిసౌజా(55) దంపతులకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. పిల్లల ఆలనా పాలనా, ఉద్యోగ.. వ్యాపార బాధ్యతల రిత్యా వారు ప్రపంచం చుట్టేయాలనే కల అలాగే ఉండిపోయింది. దీంతో పిల్లల పెళ్లిల్లు, ఇతర బాధ్యతలన్నీ పూర్తిచేసి... దేశాల పర్యటన మొదలుపెట్టారు. ఇటీవల 111 రోజుల్లో 11 దేశాలు చుట్టొచ్చిన ఈ జంట.. మళ్లీ ‘ద లైఫ్‌టైమ్ జర్నీ’ పేరుతో ప్రపంచ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

మే, 2016లో ముంబై నుంచి మొదలైన వీరి రోడ్ ట్రిప్.. చైనా, రష్యా, నార్వే, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇటలీ, గ్రీస్, ఇరాన్ మీదుగా సాగింది. ఆ వయస్సులో అంతేసి దూరాలు రోడ్ ట్రిప్ చేయడం గర్వంగా ఉన్నా, కాస్త భయంగా కూడా ఉందని పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ దంపతులు మాత్రం.. నేటి యూత్‌తో పోల్చితే మేమే చురుకైన వాళ్లమంటూ.. మరో దేశానికి బ్యాక్ ప్యాక్ సిద్ధం చేసుకుంటున్నారు. లేటు వయస్సులో వీరి యాత్ర నిజంగా సాహసమే కదూ...!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.