యాప్నగరం

చలికాలంలో లడక్‌కు వెళ్లండి

ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించుకుని ఉన్న ప్రాంతమే లడక్‌.

TNN 21 Nov 2016, 11:49 am
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని లడక్‌ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోని మరే ప్రాంతానికీ లేదనే చెప్పాలి. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించుకుని ఉన్న ప్రాంతమే లడక్‌. లడక్‌లోని కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలగాలుల కారణంగా ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. శీతాకాలంలో పర్వతప్రాంతాలపై ఉన్న మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉంటుంది. అందువల్ల చలికాలంలో అక్కడికి ఒక ట్రిప్ వేస్తే మీరు మస్త్‌గా ఎంజాయ్ చేస్తారు.
Samayam Telugu a winter trip to ladakh
చలికాలంలో లడక్‌కు వెళ్లండి


చూడాల్సిన ప్రదేశాలు: సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్‌లో చూడవచ్చు. లడక్‌లోని లెహ్‌ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్‌ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షె పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి.

వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌ నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టంగ్‌‌మాస్కాంగ్‌ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

లడక్‌ ప్రాంతాన్ని గతంలో ఎందరో రాజులు చిన్నా చితకా రాజ్యాలు ఏర్పరచుకుని పాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇక్కడున్న వాటిలో అల్చి ప్రార్థనాస్థలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.