యాప్నగరం

సిగిరియా... బౌద్ధ మఠమా? లేక రావణుడి రాజ భవనమా?

శ్రీలంకలోని సిగిరియా కొండను మీరెప్పుడైనా సందర్శించారా? లేకపోతే మాత్రం తప్పకుండా దీని విశేషాలు మీరు తెలుసుకోవాల్సిందే. రామాయణ కాలం నుంచి ఉనికిలో ఉన్న ఈ ప్రదేశం గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 20 Feb 2020, 6:09 pm
కొన్ని ప్రదేశాలు కధలను కలిగి ఉంటే కొన్ని ప్రదేశాలు మాత్రం కధలను చెబుతాయి. శ్రీలంకలోని సిగిరియాను ఈ రెండింటి కలయికగా చెప్పుకోవచ్చు. ఇది పూర్వపు బౌద్ధ మఠం యొక్క ప్రదేశమని కొందరు చెబితే... కొన్ని పురాణాలు, ఇతిహాసమైన రామాయణం ప్రకారం ఇది రావణుడి రాజ భవనమని చెబుతారు.
Samayam Telugu సిగిరియా


కశ్యప రాజు రాజధానిగా సిగిరియా

ఈ రోజు ఇక్కడ మనకు కనిపించే ఈ ప్రదేశం ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా పిలువబడే ఒక భారీ రాతి పీఠభూమి. అనేక రాత పూర్వకంగా ఉన్న రికార్డులను పరిశీలిస్తే ఈ రాతి కొండ పైభాగం కశ్యప రాజు రాజధానిగా, రాజ భవనంగా ఉండేదని తెలుస్తుంది. కొన్ని కధనాల ప్రకారం కశ్యప రాజుకు స్త్రీ వ్యామోహం ఎక్కువని, ఆయన ఈ సిగిరియాను తన ఆనంద నివాసంగా మార్చుకున్నట్లు చెబుతారు. ఈ యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇప్పుడు శ్రీలంకలో ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుంది.

Read Also: గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశ లింగాలు ఎక్కడ ఉన్నాయంటే?

రావణుడి రాజభవనం

చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే చాలా మంది చరిత్రకారులు సిగిరియాకు రామాయణ కాలంలోని రావణుడితో సంబంధం ఉన్నట్లు నమ్ముతారు. దాదాపు 50 శతాబ్ధాల క్రితం ఈ పీఠభూమిపైన రావణుడి అద్భుతమైన రాజ భవనం బంగారంతో కుబేరుడిచే రూపొందించబడిందని చెబుతారు. ఈ స్థలాన్ని పరిశీలించిన ఎవరికైనా ఇక్కడ ఎంత పెద్ద నిర్మాణ అద్భుతం ఉండేదో అర్ధమవుతుంది. దీని పై భాగానికి చేరుకోవడానికి దాదాపు 1000 మెట్లు ఉంటాయి. వీటితో పాటు రావణుడు, ఆయనను సందర్శించేందుకు వచ్చే వారి కోసం ఒక లిఫ్ట్ కూడా ఉండేదట. దాదాపు 50 శతాబ్ధాల క్రితం ఒక లిఫ్ట్ ఇక్కడ పనిచేయడం ఎలా ఉండేదో ఒక్క సారి ఊహించుకొండి.

ఈ రాతి పీఠభూమిని దగ్గరగా పరిశీలిస్తే కింది భాగంలో చాలా సంఖ్యలో గుహలు కనిపిస్తాయి. రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత ఆమెను ఈ గుహలలో ఒక దానిలో బంధించినట్లు నమ్ముతారు. ఈ కధకు బలాన్ని అందించే విధంగా ఈ గుహలలో అనేక రంగు రంగుల చిత్రాలు రామాయణ కాలాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి. అంతే కాకుండా ఇక్కడ రావణుడి భార్యలుగా భావించే అనేక మంది మహిళల చిత్రాలకు కూడా గుర్తించవచ్చు.

Read Also: ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం... ఎక్కడ ఉందో తెలుసా?

బౌద్ధుల మఠం

ఒక వేళ మీకు పురాణాల పట్ల ఆసక్తి లేకపోతే సిగిరియాను ప్రసిద్ధ బౌద్ధ మఠాల్లో ఒకటిగా నమ్ముతారు. ఇది 14వ శతాబ్ధం వరకూ వాడుకలో ఉన్నట్లు చెబుతారు. కానీ అది అకస్మాత్తుగా ఎలా కనుమరుగయ్యిందనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు.

వివిధ కాలాల్లో సిగిరియా వైభవం గురించి ప్రచారంలో ఉన్న కధల గురించి మీరు నమ్మవచ్చు... నమ్మక పోవచ్చు. కానీ నేటికీ సిగిరియా ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుందనడం మాత్రం నిజం. ఇక్కడ ఒకప్పటి వైభవం కనిపించక పోయినా దీని చుట్టూ అల్లుకున్న కధలు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.

Read Also: జమ్మూ వైష్ణో దేవి ఆలయానికి సమీపంలో తిరుమలను పోలిన ఆలయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.