యాప్నగరం

Romantic Beaches: ఇలాంటి రొమాంటిక్ బీచ్‌లకు వెళ్లాలని ఉందా? అవి ఎక్కడున్నాయో తెలుసా?

డామన్ అండ్ డయ్యు (Daman and Diu) అంటే కేంద్రపాలిత ప్రాంతమని మనందరికీ తెలిసిందే. కానీ, అదెలా ఉంటుందో బహుశా మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. చూడటానికి అచ్చం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం గోవాలా ఉంటుందని కొందరు అంటారు. అలాంటి అందమైన డామన్ అండ్ డయ్యు లోని పలు అందమైన బీచ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 10 Dec 2022, 10:26 am
2020లో కేంద్ర ప్రభుత్వం దాద్రా, నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు (ప్రాంతాలను ఏకం చేసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. దీంతో అప్పటి నుంచీ ఈ నాలుగు ప్రాంతాలు ఒకటిగా కొనసాగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం చుట్టుపక్కల అరేబియన్ మహా సముద్ర తీరంలో ఉండే ఈ అందమైన ప్రాంతాలు పలు పర్యాటక ఆకర్షణలను కూడా కలిగి ఉన్నాయి. అయితే, మనం ఇక్కడ డామన్ అండ్‌ డయ్యు లోని అందమైన బీచ్‌ల గురించే తెలుసుకుందాం. ఆ బీచ్‌లన్నీ చూడటానికి అచ్చం గోవాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. (Photo Credit: Unsplash)
Samayam Telugu do you know beautiful daman and diu beaches looks like goa
Romantic Beaches: ఇలాంటి రొమాంటిక్ బీచ్‌లకు వెళ్లాలని ఉందా? అవి ఎక్కడున్నాయో తెలుసా?



​డామన్‌లోని జాంపూర్ బీచ్..

డామన్‌లోని పరిశుభ్రమైన బీచ్‌లలో ఒకటి జాంపూర్ బీచ్. ఇది తెల్లటి ఇసుక తిన్నెలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది మోతీ దామన్ జెట్టీ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, ఇది నల్లటి మట్టి రంగు నీటికి ప్రసిద్ధి చెందింది. మరోవైపు ఇది ప్రశాంతంగా ఉండటంతో ఏకాంతాన్ని కోరుకునే వారికి సరైన ప్రదేశంగా నిలుస్తుంది. (Photo Credit: Unsplash)

Also Read: Romantic Places: మీ ప్రియమైనవారితో ఏకాంత సమయం గడపాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లొచ్చు..!

​డయ్యు లోని ఘోగ్లా బీచ్..

డయ్యు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఘోఘ్లా బీచ్ సైతం మంచి పర్యాటక ప్రదేశం. ఇక్కడ రుచికరమైన సీ ఫుడ్‌తో పాటు గుజరాతీ వంటకాలు కూడా ఆస్వాదించొచ్చు. అలాగే ఇక్కడ జల క్రీడలు ఆడాలనుకునేవారికి పారాసైలింగ్, వాటర్ స్కూటర్‌లు ఉన్నాయి. దీంతో సాహసప్రియులు ఈ బీచ్‌ని తప్పక ఇష్టపడతారు. ఇక్కడ పర్యాటకుల రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ మంచి సమయం గడపొచ్చు. (Photo Credit: Unsplash)

డామన్‌లోని దేవ్కా బీచ్..

డామన్‌లోని ఇతర బీచ్‌లలాగే ఇది కూడా అత్యంత సుందరమైన బీచ్‌గా గుర్తింపు పొందింది. దీంతో ఇది కూడా పర్యాటకులకు తప్పకుండా నచ్చే ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ సహజసిద్ధమైన అందాలే కాకుండా ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈ బీచ్ పక్కనే ఒక ప్రత్యేకమైన అమ్యూజ్‌మెంట్ పార్క్ కూడా ఉండటంతో టూరిస్టులు ఆస్వాదించడానికి సరైన ప్రదేశం. ఇందులో జలక్రీడలతో పాటు పిల్లలకు నచ్చే రైడ్లు కూడా ఉంటాయి. (Photo Credit: Unsplash)

Also Read: Sri Lanka: శ్రీలంకకు వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై హ్యాపీ జర్నీ..!

​డయ్యులోని నాగోవా బీచ్..

డయ్యులోని ఐదు బీచ్‌ల్లో అత్యంత అందమైన బీచ్ నాగోవా. ఇది డయ్యు నుండి 8 కిలోమీటర్ల దూరంలో బుచర్వాడ గ్రామ సమీపంలోని నాగోవా కుగ్రామం పక్కన ఉంటుంది. ఇక్కడ సన్నని అలలు పర్యాటకులకు గిలిగింతలు పెడతాయి. దీంతో అలల ఉధ్రుతి కూడా తక్కువగా ఉండటంతో ఈత కొట్టాలనుకునేవారికి ఇది సరైన బీచ్ అని చెప్పొచ్చు. పక్కనే ఈత చెట్లు, వాటి కిందే నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే దుకాణాలతో ఈ బీచ్ కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించే అవకాశం ఉంది. (Photo Credit: Unsplash)

​డయ్యులోని గోప్తిమాతా బీచ్..

డయ్యూలోని గోప్తిమాత బీచ్ సహజ సిద్ధమైన సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. బీచ్‌పక్కనే ఎత్తైన ఈత చెట్లు, అక్కడ వీక్షించే చల్లని గాలులు ఈ బీచ్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇక్కడి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండటంతో బీచ్‌తో పాటు సముద్ర జలాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. డయ్యు నుండి 20 నిమిషాల దూరంలో ఉండే ఈ బీచ్ కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. దీంతో మీరు డామన్ అండ్ డయ్యుని చూస్తే గోవాను చూసినట్లే అనిపిస్తుంది. (Photo Credit: Unsplash)

Also Read: New Year Travel: కొత్త సంవత్సరం వేళ ఈ ‘క్రూయిజ్‌’ ప్రయాణాలు ఆస్వాదించండి.. మన దేశంలోనే..!

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.