యాప్నగరం

Unique Villages in India: ఇవి అరుదైన గ్రామాలు గురూ.. వాటి గురించి తెలిస్తే వెళ్లకుండా ఉండలేరు!

ఇటీవల చాలా మంది ప్రశాంతమైన (Peaceful Destinations), తక్కువ రద్దీ కలిగిన (Less Crowded Places to Visit in India) ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. ఈ ఏడాది మీరు ఈ మారుమూల గ్రామాలకు వెళ్లి చూడండి. మంచి పర్యాటక అనుభూతుల్ని సొంతం చేసుకుంటారు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 20 Jan 2023, 1:18 pm
కరోనా తర్వాత చాలా మంది పర్యాటకులు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. ఏవైనా మారుమూల ప్రాంతాలు(Peaceful Destinations), జనం తక్కువగా ఉండే ప్రదేశాలకు (Less Crowded Tourist Places) వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అలా కొద్ది రోజులైనా ప్రశాంతమైన ట్రిప్లను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అయితే, మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం కొన్ని అరుదైన, మారుమూల ప్రాంతాలను సందర్శించవచ్చు. అవి తక్కువ జనాభాతో ఉండే అందమైన గ్రామాలు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit: Unsplash/Representational Image)
Samayam Telugu if you want to have peaceful trips these are the best villages in india to go out for
Unique Villages in India: ఇవి అరుదైన గ్రామాలు గురూ.. వాటి గురించి తెలిస్తే వెళ్లకుండా ఉండలేరు!



హా, అరుణాచల్ ప్రదేశ్..

హా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గిరిజన గ్రామం. ఇందులో కేవలం 289 గ్రామస్థులు మాత్రమే ఉంటారు. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉండే ఈ గ్రామం కురుంగ్ కుమే ప్రాంతంలో లాంగ్డింగ్ కోలింగ్ అనే పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. ఈ గ్రామంలోని ప్రధాన ఆకర్షణలు ప్రకృతి సహజసిద్ధమైన అందాలు, మేగ్నా గుహలు, పొగమంచు పర్వతాలు. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read: Republic Day Trips: హైదరాబాద్ వాసులు రిపబ్లిక్ డే వీకెండ్ ట్రిప్ వెళ్లాలనుకుంటే ఈ 5 డెస్టినేషన్లను ఎంచుకోవచ్చు..!

కంజి, లేహ్..

సముద్ర మట్టానికి 12,600 అడుగుల ఎత్తులో ఉండే కంజి అరుదైన గ్రామం లద్దాఖ్ ప్రాంతంలోని లేహ్ జిల్లాలో ఉంటుంది. కార్గిల్ నుండి ఈ గ్రామానికి తేలిగ్గా చేరుకోవచ్చు. ఇది ట్రెక్కర్లకు స్వర్గధామంగా ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఎవరైనా వెళ్లాలనుకునే సాహసప్రియులు రంగడుమ్ గొంప అనే ప్రాంతం నుండి ట్రెక్కింగ్ చేసి కంజి గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రామం కంజి నది ఒడ్డున ఉండటంతో స్థానికులు ఏ పనికి వెళ్లాలన్నా ఆ నది దాటాల్సిందే. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read: Travel With Friends: స్నేహితులతో చెక్కేయాలంటే ఈ అందమైన హిల్స్టేషన్లకు ప్లాన్ చేయండి..!

నిటోయ్, నాగాలాండ్..

నిటోయ్ అనే మరో అందమైన చిన్న గ్రామం నాగాలాండ్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందు కిఫైర్ అనే ప్రాంతానికి చేరుకవాల్సి ఉంటుంది. అక్కడి నుండి సులభంగా నిటోయ్ గ్రామానికి చేరుకోవచ్చు. ఇక్కడ జనాభా కూడా 500 మందికి మించదు. దీంతో ఇదో ప్రశాంతమైన గ్రామంగా అద్భుతమైన కొండల మధ్య పర్యాటకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గధామం అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా మీరు వెళ్లి చూడాల్సిందే. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read; IRCTC Vietnam Tour: ఐఆర్సీటీసీ వియత్నాం టూర్.. ధరెంతో తెలిస్తే సీట్ బుక్ చేసుకుంటారు..!

కిబ్బర్, స్పితి వ్యాలీ..

సముద్ర మట్టానికి సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ఉండే కిబ్బర్ అనే గ్రామం ప్రపంచంలోని ఎత్తైన గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో ఉండే అందమైన గ్రామం. ఇక్కడ శీతాకాలంలో విపరీతమైన మంచు కురుస్తుంది. అలాగే ఈ గ్రామంలో 80 కన్నా ఎక్కువ ఇళ్ళు ఉండవు. అవన్నీ అక్కడ దొరికే ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు. కీ గొంపాకు సమీపంలో ఉండే ఈ గ్రామంలో ఏడాదంతా ఆసక్తికరమైన పండుగలను జరుపుకుంటుంది. దీంతో మీరు ఈ గ్రామాన్ని సందర్శించడం కూడా బాగుంటుంది. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read: Airplane Emergency Exit: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలుసా..?

సంక్రి, ఉత్తరకాశీ..

మీకు అత్యంత ప్రశాంతమైన, అందమైన ప్రాంతాన్ని సందర్శించాలని ఉంటే ఉత్తరాఖండ్లోని సంక్రి అనే చిన్న గ్రామాన్ని చూడొచ్చు. ఇది అతి తక్కువ జనాభాతో, మనోహరమైన దృశ్యాలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ ఊరు గురించి మనకు పెద్దగా తెలియకపోయినా ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసేవారికి మంచి విడిది కేంద్రం అని చెప్పొచ్చు.కేదార్కంఠ, హర్-కి-దన్ మార్గంలో ఇది చివరి విశ్రాంతి కేంద్రంగా ఉంటుంది. అలాగే సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చే కొన్ని అతిథి గృహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read: Most Underrated Tourist Places in India: ఇవి అద్భుతమైన అండర్ రేటెడ్ పర్యాటక ప్రాంతాలు.. ఫిబ్రవరిలో వెళ్లడానికి చూడండి..!

లోసార్, హిమాచల్ ప్రదేశ్..

అలాగే స్పితి జిల్లాలో ఉన్న మరో అరుదైన గ్రామం లోసార్. ఇక్కడ కేవలం 350 మంది మాత్రమే ఉంటారు.ఇది మారుమూల ప్రాంతం కావడంతో చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అయితే, అక్కడ ఉండే ఒక చిన్న దాబానే పర్యాటకులకు టీ , అల్పాహారం వంటివి అందిస్తుంది. ఈ గ్రామం చుట్టూ గంభీరమైన పర్వతాలు, సుందరమైన దృశ్యాలు మైమరపిస్తాయి. సమీపంలోనే చంద్రా నది ఉండటంతో దాని అందాలు కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash/Representational Image)
Also Read: Ranthambore National Park: పెద్ద పులులను అతి దగ్గరి నుండే ఫొటోలు తీయొచ్చు..రణతంబోర్ అభయారణ్యం గురించి తెలుసా..?
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.