యాప్నగరం

ఇండియాలో ఆశ్చర్యపరిచే 7 ప్రదేశాల నిజాలు

పర్యటనల పట్ల ఆసక్తి గల వారి కోసం కొన్ని వాస్తవాలతో కూడిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాము. ఇది భారత దేశంలోని వివిధ ప్రాంతాల గురించి ఆసక్తికరమైన విషయాల సమాహారం.

Samayam Telugu 28 Mar 2020, 12:30 pm
భారత దేశానికి ఎంతో గొప్ప విశిష్టత ఉంది. ఇక్కడి విశేషాలను తెలుసుకునేందుకు, అద్భుతాలను చూసేందుకు ఎన్నో శతాబ్ధాల నుండి దేశ, విదేశీ పర్యాటకులు సందర్శనకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలు ఎంతో గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు సాంస్కృతికంగా గొప్పదైన భారతదేశం ఏ మూల నుండి వచ్చిన పర్యాటకులకైనా ఇతిహాసాలను వివరిస్తుంది. ఈ నేపధ్యంలో భారత దేశ పర్యటనకు వెళ్లాలనుకునే వారి కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇవి మన దేశంలోని వివిధ ప్రాంతాల గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు తెలియజేస్తాయి.
Samayam Telugu interesting facts of 7 indian destinations that every traveler should know
ఇండియాలో ఆశ్చర్యపరిచే 7 ప్రదేశాల నిజాలు



​పరంజాలతో కప్పబడిన తాజ్ మహల్

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం యొక్క విలువైన స్మారక చిహ్నం తాజ్ మహల్ ను వెదురు పరంజాతో మూసివేయకపోతే తాజ్ మహల్ అప్పటికే దాడికి గురై ఉండేది. 1942 లో జపనీస్ మరియు జర్మన లుఫ్ట్ వాఫ్ బాంబర్ల దాడి అవకాశాన్ని గ్రహించిన బ్రిటిష్ వారు తాజ్ మహల్ ను వెదురు గిడ్డంగిలా కనిపించేలా పరంజాతో మూసివేశారు.

​బైలీ వంతెన

బైలీ వంతెన ద్రాస్ మరియు సురు నదుల మధ్య అందమైన లడఖ్ లోయలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనల్లో ఇది ఒకటి. యుద్ధ సమయంలో ప్రయాణ సౌలభ్యం కోసం దీనిని భారత సైన్యం 1982లో నిర్మించింది. ఇది 30 మీటర్లు (98 అడుగులు) పొడవుతో సముద్ర మట్టానికి 5,602 మీటర్లు (18,379 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ వంతెనకు కుడి వైపున ఒక సరస్సు ఉంది. ఎడమ వైపున జల విద్యుత్ ఆనకట్ట ఉంది. బైలీ వంతెనపై ప్రయాణించడం ఓ మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.

​ఎప్పుడూ తడిగా ఉండే ప్రదేశం

వర్షం పడుతున్నప్పుడు అందమైన ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వర్షాకాలాన్ని, చినుకు తడి మధ్య మెరిసే ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటే మేఘాలయలోని ఖాసీ కొండలలోని చిన్న కుగ్రామమైన మౌసిన్ రామ్ ను తప్పకుండా చూసి తీరాలి. ప్రపంచంలోనే అత్యంత తడిగా ఉండే ప్రదేశం ఇది. మరో ప్రసిద్ధ ప్రదేశమైన చిరపుంజిని కూడా వర్షాన్ని ప్రేమించే వారు ఆస్వాదించవచ్చు.

​ఆశ్చర్యపరిచే లోనార్ సరస్సు

భారత దేశంలోని మహారాష్ట్ర బల్ఖానా జిల్లాలో ఉన్న లోనార్ సరస్సు లేదా లోనార్ బిలం ప్రజలు, జీవ శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. కొన్ని యుగాల క్రితం భూమిపై ఈ భాగంలో ఉల్క పడినప్పుడు సుమారు 1.2 కిలోమీటర్ల వెడల్పుతో ఈ సరస్సు ఏర్పడిందని నమ్ముతారు. దీని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ సరస్సు యొక్క నీరు ఉప్పగా ఉంటుంది. ఇక్కడ సమీప ఆలయంలో ఆకర్షణీయమైన హనుమంతుని విగ్రహం పూజలందుకుంటుంది.

​అలహాబాద్ కుంభమేళా

భారత దేశంలో జరిగే కుంభ మేళా కంటే పెద్ద ఉత్సవం ప్రపంచంలో మరొకటి లేదు. అలహాబాద్ లోని పురాతన నగరమైన ప్రయాగ్ లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభ మేళా జరుగుతుంది. ఇది ప్రపంచం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ మేళాలో అన్ని వర్గాలకు చెందిన 70 మిలియన్లకు పైగా ప్రజలు, ముఖ్యంగా సన్యాసులు, సన్యాసినులు పాల్గొంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ ఉత్సవాన్ని తప్పకుండా చూసి తీరాలి.


Read Also: ఈ మిస్టరీ ప్రదేశాలు గూగుల్ మ్యాప్స్ లో మాత్రమే కనిపిస్తాయి

​కర్మనాస ఒడ్డున ఆహారం వండరు

బీహార్ లోని కైమూర్ జిల్లాలో గంగా నది ఉపనది అయిన కర్మనాస ఒడ్డున నివసించే ప్రజలు కేవలం పండ్లు మాత్రమే తిని జీవిస్తారు. వారు అన్ని సదుపాయాలు కలిగి ఉన్నప్పటికీ ఆహారాన్ని ఎందుకు వండరో మీకు తెలుసా? లేకపోతే ఈ దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కధ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక ఋషి శాపంతో అపవిత్రం అయిన త్రిశంకు రాజు యొక్క లాలాజలం వేల సంవత్సరాల క్రితం ఈ నదిలో పడింది. అప్పటి నుండి ఈ నది పరివాహిక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆహారాన్ని వండుకుని తినడం మానేసారు.


Read Aslo: ప్రజలు ఎక్కువ కాలం బ్రతికే 5 దేశాలు

​బంగారు దేవాలయం వద్ద లక్ష మందికి ఆహారం

వంట అనేది సిక్కు మతంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. ఎందుకంటే భారత దేశంలోని అన్ని సిక్కు గురుద్వారాలు పర్యాటకులకు ఉచిత భోజనం అందిస్తున్నాయి. అదే విధంగా స్వచ్ఛంద సేవకులు అమృత్ సర్ లోని బంగారు దేవాలయం (గోల్డెన్ టెంపుల్)లో రుచికరమైన వంటలను వడ్డించడానికి మరియు శుభ్రపరచడానికి స్వచ్ఛంధంగా ముందుకు వస్తారు. ఈ ఆలయానికి ప్రతి రోజూ లక్ష మందికి ఆహారం అందిస్తున్న రికార్డు ఉంది.


Read Also: ఇండియాకు దగ్గరగా ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.