యాప్నగరం

దేశంలో అత్యంత సురక్షిత నగరంగా కలకత్తాకు స్థానం... టూరిజంకు మరింత జోష్

కలకత్తా నగరం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో అగ్ర స్థానంలో ఉండడంతో అందరి దృష్టి ఈ నగరంపై పడింది. ఈ గుర్తింపు ఎలా వచ్చిందంటే...

Samayam Telugu 12 Feb 2020, 6:48 am
ఆనంద నగరంగా పిలువబడే కలకత్తా నగరం పేరుకు తగినట్లే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా వరుసగా రెండో సారి నిలిచింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. నగరంలో అత్యల్ప నేరాలు నమోదు కావడం వలన ఈ గుర్తింపు దక్కింది.
Samayam Telugu ఇండియాలో సురక్షితమైన నగరం


కలకత్తా నగరానికి సాధారణంగా దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం దేశంలోనే సురక్షిత నగరంగా గుర్తింపు పొందడంతో పర్యాటకులు ఇక్కడ సందర్శనకు మొగ్గు చూపే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా టూరిస్టులు ఒక నగరంలో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలతో పాటు భద్రతను కూడా కోరుకుంటారు. కలకత్తా నగరం ఈ రెండు అంశాల్లోనూ మెరుగైన స్థానంలో ఉంది.

Read Also: ఇండియా ఎంత ఎత్తైనదో తెలుసా? ఈ భూమిపైనే అత్యంత ఎత్తైన ప్రదేశాలు ఇక్కడున్నాయి

2018 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికల ప్రకారం కలకత్తా 152.2 స్కోరు సాధించింది. దేశంలోని అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో కలకత్తాను హైదరాబాద్, పూణే, ముంబై అనుసరిస్తున్నాయి.

అయితే ఈ నివేదిక పశ్చిమ బెంగాల్ కు పనితీరు పరంగా పూర్తి మార్కులు ఇవ్వదు. ఎందుకంటే బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా మాత్రమే భద్రత పరంగా, నేరాల నియంత్రణ పరంగా మొదటి స్థానంలో ఉంది. మిగతా నగరాలు, పట్టణాల్లో ఇది కనిపించడం లేదు. హింసాకాండకు గురయ్యే రాష్ట్రాలలో బెంగాల్ నాల్గవ స్థానంలో ఉందని, నేరాల రేటు 46.1 గా నమోదైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Read Also: గోవాలో వింత గ్రామం... ఏడాదితో ఒక్క నెల మాత్రమే కనిపిస్తుంది

దీనిపై కలకత్తా పోలీస్ కమీషనర్ అనుజ్ శర్మ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన, అదనపు బలగాలు, కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు విజిలెన్స్ ను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. మానవ, సాంకేతికత సహాయం కలకత్తా నగరంలో నేరాల నియంత్రణకు, నిర్మూలనకు ఎంతో సహాయపడిందని పేర్కొన్నారు. ఈ సంఖ్యలు తమలో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయని తెలిపారు. అలాగే దేశంలో భద్రమైన నగరంగా కలకత్తా తన స్థానాన్ని కొనసాగిస్తుందని, పోలీసులు ఆ దిశగా నిరంతరం పని చేస్తారని భరోసా ఇచ్చారు. కలకత్తా పోలీసులు "వుయ్ కేర్, వుయ్ డేర్" అనే నినాదంతో బలంగా ముందు వెళ్తారని అన్నారు.

Read Also: సముద్రం మధ్యలో ఉండే ఈ కోటను మీరు తప్పక చూడాలి

ముఖ్యంగా మహిళలపై నేరాలను నివారించే విషయంలో రాష్ట్రం మెరుగైన పని తీరు కనబరిచింది. అలాగే అత్యాచారాలలో 10వ స్థానంలోకి పడిపోయింది. మహిళల రక్షణకు సంబంధించి ఇది మెరుగైన పరిణామం అని చెప్పవచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం ఢిల్లీ, చెన్నైలతో పాటు 2018లో యాసిడ్ దాడులను నమోదు చేసిన మూడు నగరాల జాబితాలో కలకత్తా కూడా ఉంది. కానీ నేడు ఆ కళంకాన్ని పూర్తిగా తుడిచివేసే విధంగా మహిళల భద్రతకు పెట్టపీట నగరంగా మెరుగైన స్థానంలో నిలబడి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

Read Also: విజయవాడలో నోరూరించే 10 పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.