యాప్నగరం

Valentines Day Special: తాజ్‌ మహల్ ఒక్కటే కాదు.. ఇవి కూడా ప్రేమకు ప్రతిరూపాలే!

వాలెంటైన్స్ డే (Valentines Day Special Monuments) సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమకు ప్రతి రూపాలుగా నిలిచిన కొన్ని అరుదైన కట్టడాల గురించి ఇక్కడ చెప్పుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 14 Feb 2023, 3:37 pm
మనందరికీ ప్రేమకి ప్రతి రూపం అంటే వెంటనే గుర్తొచ్చేది తాజ్‌మహాల్ (Taj Mahal) గురించే. ఆగ్రాలోని ఈ ప్రపంచ వారసత్వ కట్టడం (World Heritage Sites) గొప్ప పర్యాటక ప్రదేశమే కాకుండా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి కూడా. దీంతో ఈ తెల్లరాతి నిర్మాణాన్ని చూడటానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. అయితే, ప్రేమకు ప్రతిరూపమైన ఇలాంటి అరుదైన కట్టడాలు (Monuments of Love) ప్రపంచలోని మరికొన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కొందరు ప్రేమికులు తమ ప్రియమైన వారికోసం వాటిని నిర్మించారు. అవి ఇప్పుడు ప్రజల మన్ననలు పొందుతూ మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా అవేంటో, ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. (Photo Credit: Pixabey)
Samayam Telugu on this valentines day know these world famous monuments of love
Valentines Day Special: తాజ్‌ మహల్ ఒక్కటే కాదు.. ఇవి కూడా ప్రేమకు ప్రతిరూపాలే!


కెల్లీస్ క్యాసిల్..

మలేషియాలోని కెల్లీస్ క్యాసిల్‌ను ప్రేమకు ప్రతిరూపంగా
భావిస్తారు. దీన్ని స్కాట్లాండ్‌కు చెందిన విలియమ్ కిల్లీ స్మిత్ అనే సివిల్ ఇంజినీర్ 1909లో తన భార్య ఏగ్నస్ స్మిత్‌కు బహుమతిగా నిర్మించారని ప్రసిద్ధి. మలేషియాలోని పెరాక్ రాష్ట్రంలోని కింటా జిల్లాలో కింటా నది ఒడ్డున ఉంటుంది. ఇది చూడటానికి పెద్ద రాజ భవంతిలా ఉంటుంది. దీంతో దీన్ని కూడా మలేషియా ప్రజలు ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు. (Photo Credit: Pixabey)

బోల్డ్ క్యాసిల్..

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో 1000 ఐలాండ్స్‌లో ఉన్న బోల్డ్ క్యాసిల్ సైతం ప్రేమకు ప్రతిరూపమనే చెప్పాలి. దీన్ని జార్జ్ బోల్డ్ అనే వ్యాపారవేత్త 1900 సంవత్సరంలో తన భార్య లూయిస్‌కు బహుమతిగా ఇద్దామని ఎంతో ఆశతో నిర్మాణం తలపెట్టారు. అయితే, అది నిర్మాణంలో ఉండగానే లూయిస్ కన్నుమూసింది. దీంతో తన భార్యలేని ఆ భవంతి ఎందుకని జార్జ్ మధ్యలోనే నిర్మాణం వదిలేశారు. తర్వాత 1977లో 1000 ఐలాండ్స్ బ్రిడ్జి అథారిటీ దాన్ని సొంతం చేసుకొని పునర్‌నిర్మించింది. అప్పటి నుండి ఇదో పర్యాటక ప్రదేశంగా కొనసాగుతోంది. (Photo Credit: Pixabey)

పెటిట్ ట్రియానన్..

ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్‌లో నిర్మించిన పెటిట్ ట్రియానన్ అనే అరుదైన కట్టడం కూడా ప్రేమకు చిహ్నంగా నిలిచింది. దీన్ని ఫ్రెంచ్ రాజు లూయిస్ xv 1762, 1768 మధ్య కాలంలో నిర్మించారు. తనకెంతో ఇష్టమైన మేడం డి పామ్‌పాడోర్‌ అనే ఒకావిడకు దీన్ని బహుమతిగా ఇద్దామని చూశారు. కానీ, ఆమె ఆ భవన నిర్మాణం పూర్తికాక ముందే కన్నుమూసింది. తర్వాత లూయిస్ ఈ అరుదైన కట్టడాన్ని తన 19 ఏళ్ల భార్య మేరీ ఆన్‌టోనిట్టేకి అంకితం చేశారు. (Photo Credit: Pixabey)

మీరాబెల్ ప్యాలెస్..

ఆస్ట్రియాలోని సాల్స్‌బర్గ్‌లో నిర్మించిన మీరాబెల్ ప్యాలెస్ అరుదైన కట్టడం. దీన్ని మొదట 1606లో ప్రిన్స్ ఆర్చ్ బిషప్ అయిన వోల్ఫ్ డీట్రిచ్ రాయిటెనావ్ తన భార్య సాలోమ్ ఆల్ట్‌కు బహుమతిగా నిర్మించారు. అయితే, తర్వాతి కాలంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన మరో ఆర్చ్‌ బిషప్ ఫ్రాన్స్ ఆన్‌టోన్ దాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది మీరాబెల్ ప్యాలెస్‌గా పేరుమార్చారు.(Photo Credit: Pixabey)

తాజ్‌మహాల్..

ఆగ్రాలోని తాజ్ మహల్‌ గురించి మనందరికీ తెలిసిందే. దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం 1632-1652 మధ్య కాలంలో తీర్చిదిద్దారు. అప్పటి నుండి ఇప్పటికీ ఇది గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. దీన్ని చూడటానికి నిత్యం వేలాది మంది సందర్శకులు ఆగ్రాకు వస్తుంటారు. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. (Photo Credit: Pixabey)​

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.