యాప్నగరం

Bungee Jumping in India: ఇండియాలో బంగీ జంపింగ్ చేయాలని ఉంటే.. ఈ ప్రదేశాలకు వెళ్లండి

బంగీజంపింగ్ అనేది యువతకు బాగా ఇష్టమైన సాహస క్రీడ. దీన్ని చేయడం అంత తేలిక కాదు. అందుకు మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు శారీరకంగానూ ద్రుఢంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యవంతులై ఉండాలి. అప్పుడే బంగీజంపింగ్ క్రీడను ఆస్వాదిస్తారు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 24 Sep 2022, 4:05 pm
బంగీ జంపింగ్ గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కొండల మీద నుంచి, లేదా బ్రిడ్జిల మీద నుంచి తాళ్లను శరీరాన్ని కట్టుకొని కిందకు దూకడం. ఇదో అద్భుతమైన అనుభవం. థ్రిల్లింగ్‌గా అనిపించే సాహసం. దీంతో ఈ బంగీజంపింగ్‌ను ఆస్వాదించాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఇలాంటి సాహస క్రీడలు చేసే అవకాశం ఎక్కడ ఉంటుందో తెలియక చాలా మంది మిన్నకుండిపోతారు. ఈ బంగీజంపింగ్ చేయాలంటే ఏ విదేశాలకో వెళ్లాలని పొరపాటు పడతారు. అలా కాకుండా భారత్‌లోనే ఈ సాహస క్రీడను ఆస్వాదించే అవకాశం ఉంది. మీరు కూడా అలాంటి అరుదైన, అద్భుతమైన అనుభవాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ చెప్పిన ప్రదేశాలకు వెళ్లి ట్రై చేయండి.
Samayam Telugu places in india where you can have bungee jumping facilities
Bungee Jumping in India: ఇండియాలో బంగీ జంపింగ్ చేయాలని ఉంటే.. ఈ ప్రదేశాలకు వెళ్లండి



​రిషికేష్ టాప్ జంపింగ్..

ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ భారత్‌లో బంగీజంపింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక కొండపై ఉండే కాంటీలివర్ నుంచి 83 మీటర్ల కిందకి దూకొచ్చు. చుట్టూ పచ్చని కొండలు, కింద ప్రవహించే నది, అలరించే వాతావరణం ఇక్కడ బంగీజంపింగ్‌ను మరింత ప్రత్యేక అనుభూతికి గురిచేస్తాయి. ఇక్కడ రేటు కాస్త ఎక్కువైనా ఆ అనుభూతి పొందిన తర్వాత ఆ మాట అనరు. రిషికేష్‌కు సమీపంలోని మోహన్ చట్టీ అనే విలేజ్‌లో ఈ బంగీ జంపింగ్ చేసే అవకాశం ఉంది. ఇది భారత్‌లోనే అత్యంత హైట్‌లో నిర్వహించే బంగీజంపింగ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. (Photo Credit: @pushkin_house_goa/Instagram/Representational Image)

​లోనావాలాలోనూ అద్భుతం..

ఇక ముంబయి, పుణె, హైదరాబాద్ వంటి నగరాలకు చేరువలో ఉన్న మరో బంగీజంపింగ్ ప్లేస్ లోనావాలా. ఇది మహారాష్ట్రలోని లోనావాలా అనే ప్రముఖ పర్యాటక ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ డెల్లా అడ్వెంచరస్ సంస్థ ఈ యాక్టివిటీని నిర్వహిస్తుంది. మనకు రిషికేష్ వెళ్లాలనుకుంటే దూరం కాబట్టి ఇక్కడకు వెళ్తే బాగుంటుంది. ఇది కూడా చుట్టూ అందమైన కొండల మధ్య ఉండటంతో మీరు గొప్ప అనుభూతికి గురవుతారు. ఈ ప్లేస్‌లోని బంగీజంప్ హైట్ 45 మీటర్లు ఉంటుంది. అది పూర్తి చేశాక మీరు ధైర్యవంతులనే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. (Photo Credit: Unsplash/Representational Image)

​బెంగళూరులో క్రేన్ బంగీజంప్..

మరోవైపు ప్రముఖ ఐటీ నగరం బెంగళూరులోనూ బంగీజంపింగ్ చేసే వీలుంది. అయితే, ఇది కొండల నుంచో బ్రిడ్జ్ పై నుంచో కాదు. ఒక భారీ క్రేన్ నుంచి ఈ బంగీజంపింగ్ ఉంటుంది. ఇది రిస్క్ అని భావించకుండా మీరూ ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓజోన్ అడ్వెంచరస్ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. పకడ్బందీ ఏర్పాట్లతో మీరు ఈ క్రేన్ బంగీ జంప్‌ను ఆస్వాదించొచ్చు. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. (Photo Credit: @ewa_en_france/Instagram/Representational Image)

​దిల్లీలోనూ క్రేన్ జంపింగ్..

ఇక దిల్లీలోనూ బంగీజంప్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా భారీ క్రేన్ నుంచి చేసేదే. ఇక్కడ వండర్ లస్ట్ కాంప్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో ఈ బంగీజంపింగ్ యాక్టివిటీ నడుస్తుంది. వారు పూర్తి జాగ్రత్తలు తీసుకొని సాహస ప్రియుల చేత దీన్ని విజయవంతంగా నిర్వహిస్తారు. దీంతో మీరు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ బంగీజంప్‌ను ఆస్వాదించొచ్చు. ఇది సుమారు 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ధర కూడా రీజనబుల్‌గా ఉంటుంది. (Photo Credit:Unsplash/Representational Image)

​గోవాలో మరింత ప్రత్యేకం..

గోవాలోనూ మీరు బంగీజంపింగ్ చేయొచ్చు. ఇక్కడ జంపిన్ హైట్స్ వారి ఆధ్వర్యంలో అత్యంత అందమైన ప్రదేశంలో నిర్వహిస్తారు. ఇది నార్త్ గోవాలోని మాయెం లేక్ సమీపంలో ఉంటుంది. చుట్టూ అందమైన కొండలు, అద్భుతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడి హైట్ 55 మీటర్లు ఉండటంతో చాలా మంచి అనుభవాన్ని పొందుతారు. వీటికి తోడు మీరు చేసిన బంగీజంప్‌కు సర్టిఫికేట్‌తో పాటు వీడియో కూడా జతచేసిస్తారు. కాకపోతే రేట్ మాత్రం చాలా ఎక్కువ. (Photo Credit: @wolfgang_hells/Instagram/Representational Image)

Read All Latest Telugu News and Travel News

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.