యాప్నగరం

తాజ్ మహల్: ప్రపంచంలో అత్యధికంగా గూగుల్ చేసిన ప్రదేశం... ఎంత మందో తెలుసా?

ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ స్మారక కట్టడం ప్రపంచంలోనే అత్యధిక గూగుల్ సెర్చ్ లు పొందిన ల్యాండ్ మార్క్ గా...

Samayam Telugu 22 Feb 2020, 9:31 pm
ప్రపంచంలోని అత్యుత్తమైన స్మారక కట్టదాల్లో ఒకటైన భారతదేశంలోని తాజ్ మహల్ గూగుల్ లో అత్యధికంగా వెతికిన ల్యాండ్ మార్క్ గా అగ్రస్థానంలో నిలిచింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, బిగ్ బెన్, లండన్ ఐ, స్టోన్ హెంజ్ వంటి ఇతర ముఖ్యమైన స్మారక చిహ్నాలను వెనక్కి నెట్టి తాజ్ మహల్ మొదటి స్థానంలో నిలబడడం విశేషం. ట్రావెల్ ఇన్స్యూరెన్స్ సంస్థ కొలంబస్ డైరెక్ట్ నిర్వహించిన పరిశోధనలో ఈ ఫలితం వెల్లడైంది. పరిశోధకులు గూగుల్ కీవర్డ్ ప్లానర్ ద్వారా దీనిని గుర్తించారు.
Samayam Telugu తాజ్ మహల్


ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. అంతేకాదు దీనిని ప్రేమకు చిహ్నంగా కూడా పిలుస్తారు. తాజ్ మహల్ ప్రపంచ వ్యాప్తంగా 1417650 నెలవారీ గూగుల్ సెర్చ్ లను కలిగి ఉన్నట్లు తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. దీంతో పెరూలోని మచ్చు పిచ్చుకు గల 1269260 నెలవారీ గూగుల్ సెర్చ్ లను కూడా తాజ్ మహల్ అధిగమించింది.

Read Also: తాజ్ మహల్ ను ఈ విధంగా మీరెప్పుడూ చూసి ఉండరు

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు చిహ్నంగా 1632లో ఈ తాజ్ మహల్ ను నిర్మించాడు. ఇందులో ముంతాజ్ సమాధి ఉంటుంది. ఈ తెల్లని పాలరాతి నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలతో సహా అనేక మంది సందర్శకులను ఆకట్టుకుంటుంది.

ఈ జాబితాలోని ఇతర స్మారకాలు

అత్యధిక గూగుల్ సెర్చ్ ల్యాండ్ మార్క్స్ జాబితాలో యుఏఈలో ఉన్న బుర్జ్ ఖలీఫా 1103950 నెలవారీ సెర్చ్ లతో మూడవ స్థానంలో ఉంది. యూఎస్ఏ & కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతం ఒక నెలలో ప్రపంచ వ్యాప్తంగా 945810 సెర్చ్ లను పొంది నాల్గవ స్థానంలో ఉంది. అలాగే ఫ్రాన్స్ లో ఉన్న ఈఫిల్ టవర్ నెలకు 916270 సెర్చ్ లతో ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో నేపాల్ లోని మౌంట్ ఎవరెస్ట్ 7వ స్థానంలో, అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ 8వ స్థానంలో, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 27వ స్థానంలో, మౌంట్ ఫుజి 35వ స్థానంలో, వాటికన్ సిటీలోని అందమైన సిస్టైన్ చాపెల్ 50వ స్థానంలో ఉన్నాయి.

Read Also: తాజ్ మహల్ గురించి 10 ఆశ్చర్యకరమైన వాస్తవాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.