యాప్నగరం

Uttarakhand:దేవతల నిలయం ఉత్తరాఖండ్.. అక్కడికి వెళ్లడానికి ఇదే మంచి సమయం

ఉత్తరాఖండ్‌‌కు (Uttarakhand) దేవతల నిలయంగా పేరుంది. ఇదో భూతల స్వర్గం అని కూడా అనొచ్చు. ఈ అందమైన రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండటంతో నిత్యం పర్యాటకులు వెళ్తుంటారు. అయితే.. ఈ సెప్టెంబర్, అక్టోబర్ సీజన్‌లో అక్కడి ప్రదేశాలు మరింత రమ్యంగా ఉండటంతో ఇప్పుడు వెళ్లడం ఉత్తమమైనది. మీరూ అక్కడికి వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలను చూసి రావచ్చు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 6 Sep 2022, 2:09 pm
2000 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాంఛల్ తర్వాత ఉత్తరాఖండ్‌గా మారింది. దీని రాజధాని డెహ్రాడూన్ (Dehradun). ఈ ప్రాంతం మొత్తం వైవిధ్యభరితంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అక్కడి అందాలు మారుతుంటాయి. ఇక్కడ ప్రధానంగా హిమాలయాలు, హిమనీ నదులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అందమైన సరస్సులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. దీంతో ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం.
Samayam Telugu uttarakhand best destination to go in september and october
Uttarakhand:దేవతల నిలయం ఉత్తరాఖండ్.. అక్కడికి వెళ్లడానికి ఇదే మంచి సమయం



​కనువిందు చేసే నైనిటాల్..

నైనిటాల్ (Nainital) అంటే ప్రకృతి అందాలకు నెలవు. పచ్చదనం పర్చుకున్న కొండలు, అందమైన సరస్సులు, చూడముచ్చటైన వాతావరణానికి అనువైన ప్రాంతం. దీంతో ఈ ప్రదేశానికి భారత్‌ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. (Photo Credit: Unsplash)

​దేవతల నిలయం చమోలి..

చమోలీని(Chamouli) దేవతల నివాసం అని కూడా పిలుస్తారు, ఈ ప్రాంతం మొత్తం ఆలయాలతో నిండి ఉంటుంది. దీంతో హిందూ పురాణాలతో చారిత్రక సంబంధాన్ని కలిగి ఉంది. చిమౌలీకి కూడా పర్యాటకులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అలాగే ఇక్కడ గర్వాలీ సంప్రదాయాలను అనుభూతి చెందాలంటే చిమౌలీని తప్పక చూడాలి. (Photo Credit: Unsplash)

​ప్రముఖ పుణ్య క్షేత్రం రిషీకేష్..

ఉత్తరాఖండ్‌లో మరో ప్రసిద్ధ సందర్శనీయ స్థలం రిషీకేష్ (Rishikesh). ఇది హిందువులకు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ పలు దేవాలయాలతో పాటు గంగానది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో నిత్యం వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ శ్రీరాముడు తపస్సు చేశాడని కూడా అంటారు. మరోవైపు రిషీకేష్ యోగాకు పుట్టినిల్లుగా భావిస్తారు. ఇక్కడ అన్నిరకాల యోగాలు, మెడిటేషన్లు నేర్చుకోవచ్చు. (Photo Credit: Unsplash)

​వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్..

ఉత్తరాఖండ్‌లోని పడమర దిక్కున ఉన్న హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley of Flowers) మరో అందమైన ప్రదేశం. ఈ వ్యాలీ అరుదైన పూలమొక్కలతో పాటు హిమాలయ వృక్షజాలంతో నిండి ఉంటుంది. ఇక్కడి వెళ్లాలంటే పుష్పావతి నదితో పాటు దట్టమైన అడవులను దాటుకొని వెళ్లాలి. ఈ మార్గంలో పలు బ్రిడ్జ్‌లు, వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash)

​కౌసానీ హిల్‌స్టేషన్..

ఇక ఉత్తరాఖండ్‌లోనే మరో అందమైన హిల్ స్టేషన్ కౌసాని (Kausani Hillstation) ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి సుమారు 1890 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రకృతి మనోహరంగా ఉంటుంది. సాహస ప్రియులు హైకింగ్ లేదా ట్రెక్కింగ్ చేయాలంటే ఇది అనువైన ప్రాంతం. అలాగే ఈ కౌసానీ ప్రాంతం నుండి చూస్తే ఎత్తైన హిమాలయ పర్వతాలు చూడా కనువిందు చేస్తాయి. ఇక్కడ బైజ్‌నాథ్ ఆలయం, అనాశక్తి ఆశ్రమం, రుద్రధారి జలపాతం కౌసానీ టీ ఎస్టేట్ వంటివి కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash)

​జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్..

నైనిటాల్(Nainital) జిల్లాలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది టైగర్ రిజర్వ్ కూడా. ఈ ప్రాంతం మొత్తం కొండలు, గుట్టలు, నదీ తీరం, గడ్డి భూములు సరస్సుతో నిండి ఉంటుంది. అలాగే భారతదేశంలోని కొన్ని టైగర్ రిజర్వ్‌లలో రాత్రిపూట బస ఏర్పాట్లు కల్పించే వాటిల్లో ఇదీ ఒకటి. ఈ పార్క్‌లో వన్యప్రాణులను వీక్షించడానికి ఓపెన్ ఫోర్ వీలర్ జీపు అందుబాటులో ఉంటుంది. అందులో నుంచే పులులను కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.