యాప్నగరం

Sikkim Tour: ఇవి కదా సిక్కిం అందాలంటే.. ఇలాంటి ట్రిప్ జీవితంలో ఒక్కటి వెళ్లినా అదుర్స్ అనాల్సిందే..!

సిక్కిం (Sikkim Tour) చాలా అద్భుతమైన పర్యాటక రాష్ట్రం. పర్యటించడానికి చిన్నదే అయినా దాని అందాలు మాత్రం మరేదానికి సరిపోలవు. మీరెప్పుడైనా ఆ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలను అస్సలు మిస్ చేసుకోవద్దు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 7 Feb 2023, 7:51 pm
ఈశాన్య రాష్ట్రాల్లో (North East States) ఒకటైన సిక్కిం (Sikkim Tourism) భారతదేశంలోని రెండో అతి చిన్న రాష్ట్రమే అయినా ప్రకృతి అందాలలో దేనికీ సాటిరాదు. ఆ విషయానికి వస్తే ఇదొక సుందరైమన, అసాధారణమైన సహజసిద్ధ అందాలను కలిగి ఉంది. ప్రపంచంలోనే మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగా నుండి అనేక మనోహరమైన పట్టణాల వరకు, మారుమూల గ్రామాల నుండి అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం వరకు ఎన్నో గొప్ప గొప్ప సందర్శనీయ స్థలాలను దాగి ఉంది. ఇక సిక్కిం సంస్కృతి సంప్రదాయాల విషయంలోనూ చాలా పెద్దదని చెప్పొచ్చు. అలాంటి రాష్ట్రంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)
Samayam Telugu you should not miss these beautiful places when you visit sikkim
Sikkim Tour: ఇవి కదా సిక్కిం అందాలంటే.. ఇలాంటి ట్రిప్ జీవితంలో ఒక్కటి వెళ్లినా అదుర్స్ అనాల్సిందే..!


త్సోమ్‌గా సరస్సు..

సిక్కిం రాజధాని నగరం గాంగ్‌టాక్ నుండి కేవలం 40 కి.మీ దూరంలో ఉండే త్సోమ్‌గా అనే అందమైన సరస్సు తప్పక చూడాల్సిందే. దీన్ని చాంగు సరస్సు అని కూడా పిలుస్తారు. సిక్కింలోని అత్యంత సుందరమైన సరస్సులలో ఇదీ ఒకటి. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (Photo Credit: Unsplash)

Also Read: Lukla Airport: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఇదీ ఒకటి.. అది ఎక్కడుందంటే?

లాచుంగ్ జీరో పాయింట్..

లాచుంగ్‌లోని జీరో పాయింట్‌ను యుమే సామ్‌డాంగ్ అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 15,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ చుట్టు పక్కల ఉండే మంచు పర్వతాలు, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ప్రదేశాన్ని మరింత మనోహరంగా మారుస్తాయి. దీంతో ఇది సిక్కింలోని టాప్ సందర్శనీయ ప్రాంతాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. (Photo Credit: Unsplash)

Also Read: Valentines Day Special Tours: వాలెంటైన్స్ డేకి ఇవే రొమాంటిక్ డెస్టినేషన్లు.. వెళితే దిమ్మతిరిగే అందాలు!

కాంచనజంగా నేషనల్ పార్క్..

ఇక కాంచనజంగా నేషనల్ పార్క్‌ 2016లో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మిక్స్‌డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. హిమాలయ పర్వతాల చెంత ఉన్న ఈ ప్రాంతం జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది. దీంతో ఇదో అద్భుతమైన, తప్పక చూడాల్సిన ప్రదేశంగానూ నిలిచింది. (Photo Credit: Unsplash)

Also Read: Gurugram: గురుగ్రామ్‌లో రాతియుగం కాలం నాటి శిల్పాలు బయటపడ్డాయి.. అవి ఎన్నేళ్ల క్రితం నాటివో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కాంచనజంగా పర్వత శిఖరం..

ప్రపంచంలోని మూడో ఎత్తైన పర్వత శిఖరం అంటే కాంచనజంగానే. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటూనే మరోవైపు నేపాల్‌తోనూ పాలుపంచుకుంది. భారతదేశం వైపున్న ఈ పర్వత శ్రేణిని పవిత్రంగా పరిగణిస్తారు. దీంతో ఇక్కడి నుండి ఈ పర్వతాన్ని అధిరోహించడం కుదరదు. కానీ, మీరు ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే నేపాల్‌ నుండి ప్రయత్నించవచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Hemis National Park: లద్ధాఖ్‌ ట్రిప్‌లో చాలా మందికి తెలియనిది.. ఇది మీరు తప్పక చూసితీరాల్సినది!

ఓల్డ్ సిల్క్ రూట్/జిగ్ జాగ్ రోడ్..

ఈస్ట్ సిక్కింలోని ఓల్డ్ సిల్క్ రూట్ లేదా సిల్క్ రోడ్‌ను జిగ్ జాగ్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఈ రహదారిలో 100కు పైగా ఎక్కువ హెయిర్‌పిన్ బెండ్‌లు ఉంటాయి. దీంతో ఈ మలుపుల రోడ్డులో ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అక్కడి నుండి చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలను చూసుకుంటూ వెళ్లడం జీవితంలో మర్చిపోలేరు. (Photo Credit: Unsplash)

Also Read: Himachal Pradesh: హిమాచల్‌లో త్వరలోనే హ్యాంగింగ్ రెస్టారెంట్!

టెమీ టీ గార్డెన్..

టెమీ టీ గార్డెన్ అనేది సిక్కిం రాష్ట్రంలోనే ఏకైక టీ (తేయాకు) తోట. చుట్టూ కొండలు, లోయలు వాటి మధ్యే పచ్చని తేయాకు తోటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అలాగే అక్కడి నుండి కాంచన జంగా వీక్షణలు కూడా ఆ ప్రాంతాన్ని తప్పక సందర్శించేలా చేస్తాయి. పచ్చని టీ తోటలు, తెల్లని కాంచనజంగా హిమాలయాలు నేత్రానందం కలిగిస్తాయి. (Photo Credit: Unsplash)

Also Read: IRCTC Thailand Tour Package: ఈ థాయ్‌లాండ్ టూర్‌ ప్యాకేజీ ధర తెలిస్తే.. సీట్ బుక్‌చేసుకోకుండా ఉండలేరు!

రుమ్‌టెక్ మొనాస్టరీ..

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌ సమీపంలో ఉండే రుమ్టెక్ మొనాస్టరీ ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద బౌద్ధ మఠాలయం అని చెప్పొచ్చు. అది గ్యాంగ్‌టాక్ నుండి సుమారు 24 కి.మీ దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇది ఆ రాష్ట్రంలోని బౌద్ధ మతస్థులకు పవిత్ర ప్రదేశం అని చెప్పొచ్చు. ఈ మఠం కర్మపా లామా స్థానం కూడా. (Photo Credit: Unsplash)

Also Read: US Visas: అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. అక్కడికెళితే రెండు వారాల్లో వీసా!

గ్యాంగ్‌టక్..

సిక్కిం రాజధాని నగరం గ్యాంగ్‌టక్ అత్యంత అందమైనదే కాదు అత్యంత శుభ్రంగానూ ఉంటుంది. ఇక్కడి ట్రాఫిక్ కూడా చాలా క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా ఉండటంతో ఈ హిల్‌స్టేషన్‌ను హ్యాపీగా విహరించి రావచ్చు. చుట్టూ కొండలు, లోయలు, పచ్చని అందాలు ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాగే అక్కడి అందాలు చూడటానికి రోప్‌వేలు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో ఇది కూడా సందర్శించవచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Yana Caves: స్నేహితులతో సాహస యాత్ర చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రదేశాన్ని పరిశీలించండి

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.