యాప్నగరం

ఆ దేశంలో నవ్వకపోతే నేరం!

ఔను, అక్కడ ఎవరైనా నవ్వకుండా కనిపిస్తే భారీ జరిమానా విధిస్తారు. కుక్కలను అతిగా నడిపిస్తే ఫైన్ కట్టాలి. ముగ్గురి కంటే ఎక్కువ మంది పార్టీ చేసుకుంటే నేరం. ఇలాంటి వింత చట్టాలు అమలు చేస్తున్న దేశం

TNN 15 May 2017, 2:00 pm
ఔను, అక్కడ ఎవరైనా నవ్వకుండా కనిపిస్తే భారీ జరిమానా విధిస్తారు. కుక్కలను అతిగా నడిపిస్తే ఫైన్ కట్టాలి. ముగ్గురి కంటే ఎక్కువ మంది పార్టీ చేసుకుంటే నేరం. ఇలాంటి వింత చట్టాలు అమలు చేస్తున్న దేశం ఇటలీ. దేశమంతటా ఇవే రూల్స్ లేకున్నా, ఆ దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రం వీటిని అమలు చేస్తున్నారు. జరిమానాలతో ఆయా నగర పాలక సంస్థలు భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. మరి, ఇలాంటి చట్టాలు మన దేశంలో అమలైతే... ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో!!
Samayam Telugu going to milan smile please
ఆ దేశంలో నవ్వకపోతే నేరం!


❤ ఇటలీలో అబ్బాయిలు స్కర్టులు ధరిస్తే అరెస్ట్ చేస్తారు. (అదేంటీ, స్కర్టులు ధరించే అబ్బాయిలు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారా? ఏమో, ఆ దేశంలో ఉంటారేమో!)
❤ ఇటలీలోని మిలాన్‌ సిటీలో ఎవరూ విషాదంగా కనిపించకూడదు. ఆ నగరంలో ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో కనిపించాలి. లేకుంటే భారీ జరిమానా చెల్లించాలి. అయితే, ఆసుపత్రులు, అంత్యక్రియల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది. (హమ్మయ్య.. బతికించారు)
❤ ఉత్తర ఇటలీలోని తురిన్‌ నగరంలో పెంపుడు కుక్కలను రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ నడిపించకూడదు. అలా చేస్తే... యజమాని జరిమానా చెల్లించాలి. (కుక్కలు ఫిర్యాదు చేస్తాయా అని అడగవద్దు. కనిపెట్టేందుకు ప్రత్యేకంగా సిబ్బంది లేదా జంతు ప్రేమికులు ఉంటారు. లేదా, పక్కింటోడు చాలు!!)
❤ ఉత్తర ఇటలీలోని లెరిసీలో కిటీకీలో టవల్ ఆరబెడితే నేరం. (దుప్పట్లు, షర్టు, ఫ్యాంట్లు ఆరబెట్టవచ్చా?)
❤ రోమ్‌లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండే గ్రూపులకు పాటలు పాడేందుకు, తాగేందుకు, డ్యాన్స్ చేసేందుకు, నగర వీధుల్లో తినేందుకు అనుమతి ఇవ్వరు. (ముగ్గురైతే బుద్ధిగా ఉంటారని కాబోలు. వాళ్లు మన ‘3 ఇడియట్స్’ ఇంకా చూసి ఉండరు)
❤ ఎరాక్లియాలో బీచ్‌లో సరదాకైనా ఇసుకతో ఇల్లు కట్టకూడదు. అలా చేస్తే జరిమానా విధిస్తారు. (మన దేశంలో కల్తీ చేసి.. ఏకంగా భవనాలే కట్టేస్తున్నారు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.