యాప్నగరం

వామ్మో ఇండిగో.. ఇంజిన్ సమస్యతో 3 గంటలు నరకం!

ఇటీవల తరచు వార్తల్లో ఉంటున్న ఇండిగో మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే, ఈసారి విమాన సిబ్బంది కాకుండా.. విమానమే ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది.

Samayam Telugu 19 May 2018, 1:58 pm
టీవల తరచు వార్తల్లో ఉంటున్న ఇండిగో మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే, ఈసారి విమాన సిబ్బంది కాకుండా.. విమానమే ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ఇంజిన్ సమస్యతో మూడు గంటల పాటు ఎక్కడికీ కదలకుండా ప్రయాణికులు విమానంలోనే కూర్చోవల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన శనివారం ఉదయం లక్నోలో చోటుచేసుకుంది.
Samayam Telugu ads


లక్నో విమానాశ్రయం డైరెక్టర్ ఏకే శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 171 మంది ప్రయాణికులతో ఉన్న 6E 685 లక్నో-ముంబయి ఇండిగో విమానం ఉదయం 7.40 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్యల వల్ల అది 11.30 గంటలకు బయల్దేరింది. విమానం బయల్దేరడానికి ముందు పైలట్ ఇంజిన్లో సమస్య ఉన్నట్లు గుర్తించడంతో విమానం ఆలస్యంగా బయల్దేరింది.

అయితే, ఈ మూడు గంటలూ ప్రయాణికులు విమానంలో నరకయాతన అనుభవించారు. ఏసీలు కూడా పనిచేయకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నట్లు ప్రయాణికులు కొందరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాంకేతిస సమస్యలను విమానయాన ముందుగానే ఎందుకు తనిఖీ చేసుకోలేదని పలువురు ప్రశ్నించారు. కనీసం ప్రత్యామ్నయ ఏర్పాట్లు కూడా చేయకుండా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు.

దీనిపై ఇండిగో వివరణ ఇస్తూ.. ‘‘ఇంజిన్లో చిన్న సమస్య తలెత్తింది. చిన్న చిన్న మరమ్మతుల తర్వాత విమానం లక్నో నుంచి ముంబయికి బయల్దేరింది’’ అని చెప్పింది. అయితే, పైలట్ ముందుగానే సమస్యను గుర్తించిన నేపథ్యంలో ప్రయాణికులకు ప్రమాదం తప్పినట్లయ్యింది. ఇదే సమస్య విమానం గాల్లో ఉన్నప్పుడు ఏర్పడి ఉంటే పరిస్థితి ఇంతకంటే దయనీయంగా ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.