యాప్నగరం

19 దేశాలు.. 22,200 కిమీలు.. కారులోనే తిరిగేశారు!

73 ఏళ్ల వయస్సులో 72 రోజుల్లో 19 దేశాలు తిరగడం అంటే మాటలు కాదు. అదీ.. రోడ్డు మార్గంలో. నమ్మశక్యంగా లేదు కదూ. అయితే, ఈ జంట సాధ్యం చేసి చూపించారు.

TNN 15 Jul 2017, 3:15 pm
73 ఏళ్ల వయస్సులో 72 రోజుల్లో 19 దేశాలు తిరగడం అంటే మాటలు కాదు. అదీ.. రోడ్డు మార్గంలో. నమ్మశక్యంగా లేదు కదూ. అయితే, ఈ జంట సాధ్యం చేసి చూపించారు. ముంబయికి చెందిన బద్రీ బల్దావా(73), భార్య పుష్పా బల్దావాలు.. తమ 10 ఏళ్ల మనవరాలు నిషితో కలిసి తమ బీఎండబ్ల్యూ X5లో ఈ రోడ్ ట్రిప్ పూర్తి చేశారు. దాదాపు 72 రోజుల్లో 22,200 కిమీలు ప్రయాణిస్తూ.. 19 దేశాలు దాటి లండన్‌కు చేరుకున్నారు.
Samayam Telugu indian couple pull off a mumbai to london road trip cover 19 countries in 72 days
19 దేశాలు.. 22,200 కిమీలు.. కారులోనే తిరిగేశారు!


ఇండియా నుంచి లండన్‌కు రోడ్డు మార్గం ఉందా అనేదేగా మీ సందేహం. మీ సందేహం కరెక్టే. భారత్ నుంచి నేరుగా లండన్‌కు రోడ్డు మార్గం లేదు. కొన్ని దేశాల అనుమతితో సరిహద్దులు దాటుతూ చేరుకోవాలి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మీదుగా మార్గం ఉన్నా.. అది ప్రమాదకరం. దీంతో బద్రీ ఇండియా నుంచి నేరుగా మణిపూర్‌లోని ఇంపాల్‌కు కారులో చేరుకుని, అక్కడ మరికొందరితో కలిసి లండన్‌కు బయల్దేరారు.

72 ఏళ్ల బద్రీ 2015లో ఐస్‌ల్యాండ్ మొత్తం కారులోనే చుట్టేశారు. ఇండియాలో కూడా ఆయన ముంబయి నుంచి బద్రీనాథ్‌.. చివరికి ఎవరెస్టు బేస్ క్యాంప్ వరకు రోడ్‌ట్రిప్ చేసిన అనుభవం ఉంది. లేటు వయస్సులో కూడా ఆయన దాదాపు 72 రోజుల పాటు డ్రైవింగ్ చేశారంటే నిజంగా అద్భుతమే. ఆయనలా మీరు కూడా ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఈ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.