యాప్నగరం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫొటోగ్రఫీ ఫెస్టివల్

కళ్ల ముందు క్షణాల్లో మాయమయ్యే అద్భుతాలను.. కెమేరా కంటితో అద్భుతంగా ఒడిసిపట్టే ఫొటోలను చూస్తే ఔరా అనకుండా ఉండలేం.

Samayam Telugu 27 Aug 2018, 1:08 pm
ళ్ల ముందు క్షణాల్లో మాయమయ్యే అద్భుతాలను.. కెమేరా కంటితో అద్భుతంగా ఒడిసిపట్టే ఫొటోలను చూస్తే ఔరా అనకుండా ఉండలేం. కొన్ని ఫొటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భావోద్వేగాలను నింపుతాయి. ప్రపంచంలో ఇలాంటి ‘చిత్రాల’కు కొదవేలేదు. మరి, వాటన్నిటినీ ఒకే చోట చూసే అవకాశం లభిస్తే.. భలే ఉంటుంది కదూ!
Samayam Telugu Untitleda


ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ నిర్వహణ కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 7 వరకు ‘ది ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ - 2018 (ఐపీఎఫ్)’ నిర్వహించనుంది. ఇందులో 25 దేశాల నుంచి 550 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఫోటోగ్రాఫర్లకు చిక్కిన భిన్న ఫొటోలను చూసే అవకాశం లభించనుంది. అంతేకాదు, ప్రత్యేక వర్క్‌షాప్‌లు, చర్చా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం 99631 24445 /99633 71314 నంబర్లను సంప్రదించగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.