యాప్నగరం

ఇక సందర్శన ప్రాంతంగా RSS హెడ్‌క్వార్టర్స్‌!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రధాన కార్యాలయానికి మహారాష్ట్ర ప్రభుత్వం సి-గ్రేడ్ టూరిజం స్టేటస్ ఇచ్చింది.

Maharashtra Times 11 May 2018, 7:21 pm
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రధాన కార్యాలయానికి మహారాష్ట్ర ప్రభుత్వం సి-గ్రేడ్ టూరిజం స్టేటస్ ఇచ్చింది. ఇకపై నాగపూర్‌కు వెళ్లే పర్యాటకులు ఆర్ఎస్ఎస్ భవనాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌గా ఈ భవనాన్ని పిలుస్తారు.
Samayam Telugu 11aaaaaa


మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ), జిల్లా ప్లానింగ్ కమిటీల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1925లో నాగపూర్‌లోని మహల్ ప్రాంతంలో హెగ్గేవార్‌తో పాటు నలుగురు ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించారు. ఆయన జూన్ 21, 1940 మరణించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ‘నాగపూర్ దర్శన్’ జాబితాలో స్మృతి మందిర్‌ పేరును కూడా చేర్చారు.
Read this article in Marathi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.