యాప్నగరం

IRCTC: డబ్బు చెల్లించకుండానే టికెట్లు!

టికెట్ తీసుకోడానికి జేబులో చిల్లిగవ్వ కూడా లేదా? ఏం ఫర్వాలేదు. ముందు టికెట్ తీసుకొని నగదు మరెప్పుడైనా చెల్లించండి. అదెలా...

TNN & Agencies 1 Jun 2017, 6:27 pm
టికెట్ తీసుకోడానికి జేబులో చిల్లిగవ్వ కూడా లేదా? ఏం ఫర్వాలేదు. ముందు టికెట్ తీసుకొని నగదు మరెప్పుడైనా చెల్లించండి. అదెలా అనుకుంటున్నారా? IRCTC త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి తేనుంది. ‘Buy tickets now and pay later’ (ముందు టికెట్లు తీసుకోండి, నగదు తర్వాత చెల్లించండి) అనే సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు.
Samayam Telugu passengers will be able to buy tickets from the irctc and pay later
IRCTC: డబ్బు చెల్లించకుండానే టికెట్లు!


ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి సందీప్ దత్త ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ సదుపాయం కోసం తాము ముంబయికి చెందిన ‘ఇ-పేలేటర్’ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు జర్నీకి ఐదు రోజులు ముందుగా టికెట్ తీసుకుని 14 రోజుల లోపు చెల్లించాలి. అయితే, ఇందుకు 3.5 శాతం సర్వీస్ చార్జ్ పడుతుందని వివరించారు. అయితే, ఈ సదుపాయం కేవలం ఇ-టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ విధానంలో టికెట్లు పొందే ప్రయాణికులు తమ పేరు, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఇవ్వాలని రైల్వే అధికారులు తెలిపారు. వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా వినియోగదారుడికి సేవలు పొందేందుకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. క్రెడిట్ కార్డు తరహాలోనే ఈ సేవలు ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.