యాప్నగరం

Canada: కెనడా వెళ్లాలనుకునేవారు ఆగండి.. బీభత్సమైన మంచు తుఫాన్..!

కెనడా (Canada) బీభత్సమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీ మంచు తుఫాన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో కెనడాకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 26 Dec 2022, 6:29 pm
కెనడాలో భారీ మంచు తుఫాన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ విపరీతమైన చల్లని గాలులు వీస్తూ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై భారీ మంచు పేరుకుపోయి రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిపివేయడంతో ప్రజలు అంధకారంలో మిగిలిపోయారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో మీలో ఎవరైనా ఇప్పుడు కెనాడాకు వెళ్లాలనుకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
Samayam Telugu canada-thumb


Also Read: Goa Travel Updates: గోవా వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొచ్చు..!

క్రిస్మస్‌కు ముందు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే కనిపించాయి. దీంతో అక్కడ చాలా మంది క్రిస్మస్ హాలిడేస్‌ని ఎంజాయ్ చేయలేకపోయారు. క్రిస్మస్ వీకెండ్‌లో రావడంతో చాలా మంది ఎక్కడికైనా వెళ్లాలనుకొని భారీ ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే, మంచు ప్రభావం కారణంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కెనడాలోనూ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒంటారియో, క్యూబెక్, అట్లాంటిక్ కెనడా రాష్ట్రాలు అధికంగా మంచు ప్రభావాన్ని చూస్తున్నాయి.

Also Read: Hyderabad City Tour: న్యూ ఇయర్‌ హైదరాబాద్ సిటీ టూర్.. రూ.500కే ఏసీ బస్‌లో రోజంతా..!

సహజంగానే కెనడాలో శీతాకాలంలో విపరీతమైన మంచు కురుస్తుంటుంది. అది ఈసారి మరింత ఎక్కువైందని, దాంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే తక్కువ సమయంలోనే ప్రజా జీవనం స్తంభించిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో డొమెస్టిక్‌తో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా నుంచి కెనడా వెళ్లాలనుకునేవారు కొద్ది రోజులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమం.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.