యాప్నగరం

DigiYatra: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై తేలికైన ప్రయాణం..!

భారత్‌లోని మూడు విమానాశ్రయాల్లో డిజియాత్ర (DigiYatra) పేరిట ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇకపై తమ ఐడెంటిఫికేషన్‌కు సంబంధించిన ధ్రవపత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ విశేషాలేంటో పూర్తిగా తెలుసుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 3 Dec 2022, 9:46 pm
దిల్లీ, వారణాసి, బెంగళూరు విమానాశ్రయాల్లో ఇప్పుడు డిజియాత్ర టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో విమాన ప్రయాణికులు ఇకపై తేలిగ్గా ప్రయాణాలు సాగించే అవకాశం లభించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణికుల ప్రయాణాలను మరింత సులభతరం చేయనుంది. ఇది బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ద్వారా కాగిత రహిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. దీంతో ప్రయాణికులు బోర్డింగ్ పాస్, ఐడెంటిఫికేషన్ చెకింగ్ కోసం పేపర్ పత్రాలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
Samayam Telugu banglore-thumb


ప్రయాణికులు ఒకసారి డిజియాత్ర యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే విమానాశ్రయాల్లో వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండా ప్రయాణాలు చేయొచ్చు. అంటే ప్రయాణికులు బోర్డింగ్ పాస్ కౌంటర్ల వద్ద ఐడెంటిఫికేషన్ ధ్రువపత్రాలు చూపించకుండా ఫేషియల్ రికగ్నిషన్ చేయించుకొని వెళ్లిపొవచ్చు. తద్వారా ప్రయాణికుల వివరాలు సాంకేతికంగా నమోదవుతాయి. ఈ డిజియాత్ర టెక్నాలజీని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే ప్రారంభించారు. తొలి దశలో ఈ సాంకేతికతను ఏడు విమానాశ్రయాల్లో ప్రవేశపెడుతున్నారు. అందులో దిల్లీ, వారణాసి, బెంగళూరు విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక మార్చి 2023 నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పూణె, విజయవాడ విమానాశ్రాయల్లో ఈ టెక్నాలజీ రానుంది.

త్వరలోనే ఈ సాంకేతికత అన్ని విమానాశ్రాయాల్లోనూ అందుబాటులోకి వస్తుందని, తద్వారా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉందన్నారు. అయితే, ప్రయాణికుల సమాచార భద్రతకు సంబంధించి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రయాణీకుల వివరాలన్నీ వారి స్మార్ట్‌ఫోన్‌లోనే సురక్షితమైన వాలెట్‌లో ఉంటాయని చెప్పారు. ఆ డేటా మొత్తం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని కలిగిఉంటుందని దాంతో ప్రయాణికుల వివరాలు 24 గంటల్లో సర్వర్‌ల నుండి తొలగిపోతుందని స్పష్టం చేశారు.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.