యాప్నగరం

Flipkart Hotels: ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్.. ఇకపై హోటల్స్‌ కూడా బుక్ చేసుకునే సదుపాయం

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ (Travel and Tourism) రంగంలోకి అడుగుపెట్టింది. దీంతో తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్‌ యాప్, వెబ్‌సైట్‌ల నుంచి హోటల్స్, ఫ్లైట్ బుకింగ్ సౌలభ్యాన్ని కల్పించింది. దీంతో ఎవరైనా తేలిగ్గా ఈ కొత్త సదుపాయాలను కూడా వినియోగించవచ్చు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 8 Sep 2022, 4:00 pm
ఇప్పటికే Flipkart flight పేరిట విమాన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించిన ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా హాస్పిటాలిటీ సెక్టార్‌లోనూ అడుగుపెట్టింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే టూరిజం రంగం మెరుగు పడుతున్న దశలో మరో కొత్త ఫీచర్‌ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు హోటల్స్, ఫ్లైట్స్‌ బుకింగ్స్ రెండింటినీ ఒకే చోట బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సర్వీసులను క్రియర్ ట్రిప్ ఏపీఐ సహాయంతో అందిస్తోంది. దీంతో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది.
Samayam Telugu flipkart


ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా తమ వినియోగదారులకు మరింత ఉత్తమమైన, అద్భుతమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్ష్ మీనన్ పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో నగరాలతో పాటు టైర్ సిటీస్‌లోనూ ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. తద్వారా భారతీయ వినియోగదారులకు Flipkart వన్‌స్టాప్ షాప్‌గా నిలుస్తుందని చెప్పారు. తమ ఫీచర్ ద్వారా మొత్తం జాతీయం, అంతర్జాతీయంగా 3 లక్షల హోటల్స్‌‌లో బుకింగ్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు పూర్వస్థితికి చేరుకున్నాయి. దీంతో పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గడిచిన మూడు నెలల్లోనే టూరిస్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలా ట్రావెల్ ఇండస్ట్రీ 70 శాతం పెరుగుదలను చూసింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ నూతన సదుపాయాన్ని తీసుకురావడం గమనార్హం. అయితే, మార్కెట్‌లో ఇప్పటికే పలు సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. వాటిని తట్టుకొని ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌లో ఎలా నిలుస్తుందో చూడాలి. అయితే, హాస్పిటాలిటీ రంగంలో హోటల్ బుకింగ్స్ అన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటంతో ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులపై భారీ అంచనాలు పెట్టుకుంది. రాబోయే ఫెస్టివల్ సీజన్‌లో వారు ఈ సదుపాయాల్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తోంది.

Read Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.