యాప్నగరం

IRCTC Madhya Pradesh: అతి తక్కువ ధరకే మధ్య ప్రదేశ్ టూర్ ప్యాకేజీ.. ఆ మూడు ప్రదేశాలను చూడొచ్చు..!

మధ్య ప్రదేశ్‌లోని (IRCTC Madhya Pradesh Tour) పర్యాటక ప్రదేశాలు చూడాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇందులో గ్వాలియర్, ఓర్ఛా, ఖజరహో అందాలు చూసే అవకాశం కల్పించింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 10 Mar 2023, 12:06 pm
దేశంలోని గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో ఒకటి మధ్య ప్రదేశ్ (IRCTC Madhya Pradesh Tour). అక్కడ పలు సందర్శనీయ స్థలాలు, ప్రముఖ దేవాలయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన పర్యాటక ప్రాంతాలను చూపించే విధంగా ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. అది ఈ నెల 17 నుంచి ప్రారంభంకానుంది. ముఖ్యంగా ఇది హైదరాబాద్ నుండే ప్రారంభమవుతుండటంతో తెలిగ్గా వెళ్లొచ్చే అవకాశం ఉంది. దీంతో మీకూ ఆ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియాలంటే ఈ సమాచారం తెలుసుకొని సీట్ బుక్‌చేసుకోవచ్చు. (Photo Credit: Unsplash)
Samayam Telugu irctc madhya pradesh tour package from hyderabad at very low cost
IRCTC Madhya Pradesh: అతి తక్కువ ధరకే మధ్య ప్రదేశ్ టూర్ ప్యాకేజీ.. ఆ మూడు ప్రదేశాలను చూడొచ్చు..!


హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్..

ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ పేరు హెరిటేజ్‌ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇందులో 5 రాత్రులు, 6 రోజుల పాటు ఆ రాష్ట్రంలోని సందర్శనీయ ప్రాంతాలైన గ్వాలియర్, ఖజురహో, ఓర్ఛా ప్రాంతాలను చూపిస్తారు. ఇది మార్చి 17న కాచీగూడ నుండి మొదలై తిరిగి మార్చి 22న సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో పూర్తవుతుంది. దీంతో ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)

Also Read: Maldives Trip: పర్యాటకులు ఎక్కువగా మాల్దీవ్స్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటారంటే.. ఇవే కారణాలు..!

కంఫర్ట్ క్లాస్ ధరల వివరాలు..

ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని కంఫర్ట్, స్టాండర్డ్ క్లాస్‌లలో ప్రవేశపెట్టింది. కంఫర్ట్ క్లాస్ కింద 1 నుండి 3 ప్రయాణికులుంటే సింగిల్ పర్సన్‌కు రూ.31,790, ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.18,130, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.14,310గా పేర్కొంది. అదే 4-6 ప్రయాణికులుంటే డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.15,530, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.13,440 వెల్లడించింది. అలాగే 5 నుండి 11 ఏళ్ల చిన్నారులకు రూ.11,210గా స్పష్టంచేసింది. (Photo Credit: Unsplash)

Also Read: Lakkidi Hill Station: ప్రకృతికి దగ్గరగా రద్దీకి దూరంగా.. ఏకాంతం కోరుకునేవారికి సరైన గమ్యస్థానం..!

​స్టాండర్డ్ క్లాస్ ధరల వివరాలు..

ఇక స్టాండర్డ్ క్లాస్ ధరలు కాస్తంత తక్కువగా ఉన్నాయి. ఇందులో 1-3 ప్రయాణికులుంటే ఒక్కరికి రూ.29,050, అదే డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.15,380, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.11,560గా వివరించింది. అదే 4-6 ప్రయాణికులుంటే డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.10,370, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.8,760 గా వెల్లడించగా 5 నుండి 11 ఏళ్ల చిన్నారులకు రూ.8,460గా పేర్కొంది. దీంతో మీరు ఈ పర్యటనకు 6 మంది స్నేహితులతో వెళ్లినా లేదా కుటుంబ సభ్యులతో వెళ్లినా రూ.8,760 తక్కువ ధరకే టూర్‌ను ఆస్వాదించొచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Pre Wedding Photoshoots: ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశాలను ఓ లుక్కేయండి..!

ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్ కింద 12 సీట్లు అందుబాటులో ఉండగా కంఫర్ట్ క్లాస్‌లో 6 సీట్లే ఉన్నాయి. దీంతో మీరు ఈ పర్యటనకు వెళ్లాలనుకుంటే వెంటనే ఐఆర్సీటీసీ సంప్రదించి సీట్లను బుక్ చేసుకోవడం మంచిది. లేదంటే మరో ట్రిప్‌ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక ఈ టూర్‌లో బోర్డింగ్ పాయింట్లుగా కాచీగూడ, కాజీపేట్‌ స్టేషన్లను కేటాయించారు. అదే డీబోర్డింగ్‌కు కాజీపేట్, సికింద్రాబాద్‌ స్టేషన్లను పేర్కొన్నారు. దీంతో మీరు ఈ మూడు స్టేషన్ల నుండే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. (Photo Credit: Pixabey)

Also Read: Irctc Alleppey, Munnar Package: అల్లెప్పీ, మున్నార్ టూర్ ప్యాకేజీ.. వచ్చే వారం నుంచే పర్యటన..!

​కాచీగూడ టు గ్వాలియర్..

ఈ టూర్ మార్చి 17న కాచీగూడ రైల్వేస్టేషన్‌ నుండి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:40 గంటలకు సంపర్క్ క్రాంతీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం గ్వాలియర్‌కు చేరుకుంటుంది. అక్కడ టూర్ ఆపరేటర్ మీకు స్వాగతం పలికి ఓ హోటల్‌కు తీసుకెళతారు. అనంతరం రీఫ్రెష్ అయ్యాక స్థానికంగా ఉండే యోగిని ఆలయాన్ని చూపిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి విశ్రాంతి తీసుకుంటారు. (Photo Credit: Unsplash)

Also Read: Unique Holi Celebrations: సాంగ్లా వ్యాలీలో యూనిక్ హోలీ సెలబ్రేషన్స్.. అదెక్కడో తెలుసా?

ఓర్చా, ఖజురహో..​

మరుసటి రోజు ఉదయం గ్వాలియర్ కోటను సందర్శిస్తారు. అక్కడి నుండి జై విలాస్ ప్యాలెస్ చూశాక మధ్యాహ్నం ఓర్ఛాకు బయలుదేరతారు. ఓర్ఛాలో సందర్శనీయ స్థలాలను కూడా చూశాక ఆపరేటర్ మిమ్మల్ని ఖజురహో వంటి ప్రముఖ చారిత్రక ప్రదేశానికి తీసుకెళతారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఖజురహోలోని దేవాలయాలన్నీ చూపిస్తారు. ఇక పర్యటనలో ఐదో రోజు సమీపంలోని రానే వాటర్‌ ఫాల్స్ సందర్శించాక రాత్రికి మిమ్మల్ని సాత్నా రైల్వే స్టేషన్‌లో వదులుతారు. అక్కడి నుండి రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ రైలులో తిరిగి పయనమై మరుసటి రోజు రాత్రి ఇంటికి చేరుకుంటారు. (Photo Credit: Unsplash)

Also Read: IRCTC North East Tour: ఐఆర్సీటీసీ నార్త్ ఈస్ట్ ట్రిప్.. 15 రోజుల అద్భుతమైన యాత్ర..

​ప్యాకేజీలో లభించేవి..

ఈ ప్యాకేజీలో ప్రయాణికులు తక్కువ ధరకే మంచి సౌకర్యాలు పొందనుండటం గమనార్హం. స్టాండర్డ్ క్లాస్ ప్యాకేజీకి స్లిపర్ క్లాస్ రైలు ప్రయాణం కేటాయించగా కంఫర్ట్ క్లాస్ ప్యాకేజీకి 3 AC ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ఐట్నరీలోని ప్రదేశాలను చూపించడానికి ఏసీ వెహికిల్ అరేంజ్ చేస్తారు. ఈ ప్యాకేజీలో మూడు రోజుల పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, హోటల్ వసతి ఉంటాయి. అలాగే ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అందులోనే ట్యాక్స్‌లు కూడా కలిసి ఉంటాయి. (Photo Credit: Unsplash)

Also Read: Rishikesh Trip: ఈ ఫొటోలు చూస్తే రిషికేశ్ ట్రిప్ ప్లాన్ చేసుకోకుండా ఉండరు.. ఒకసారి మీరే చూడండి..!

ప్యాకేజీలో ఉండనివి..

ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉండవు. అవి వారే సొంతంగా చూసుకోవాలి. అలాగే రైలు ప్రయాణంలోనూ కేవలం ప్రయాణ సేవలే ఉంటాయి. ఇక్కడ కూడా భోజనానికి ప్రత్యేకంగా చెల్లించాలి. సందర్శనీయ స్థలాల్లోని ఎంట్రీ టికెట్లు ఉంటే అవి వారే తీసుకోవాలి. ఇక టూర్‌ గైడ్‌కు కూడా అంతో ఇంతో చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఖర్చులు కూడా ప్యాకేజీలో భాగం కావు. ఇవి అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. మరింత పూర్తి సమాచారం కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించడం మంచిది. (Photo Credit: Unsplash)

Also Read: Kolkata: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.