యాప్నగరం

IRCTC South India Tour: ఐఆర్సీటీసీ దక్షిణ భారత టూర్ ప్యాకేజీ.. ఎప్పుడంటే..!

ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ (IRCTC South India Tour) ప్రవేశపెట్టింది. ఈ టూర్‌లో పర్యాటకులకు కన్యాకుమారి, రామేశ్వరం, మదురై వంటి మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 8 Feb 2023, 3:56 pm
దక్షిణా భారత దేశంలోని (South India Tour) మూడు ముఖ్యమైన ప్రాంతాలు కన్యాకుమారి, రామేశ్వరం, మధురై. ఈ మూడు ప్రాంతాలను చూపించే విధంగా ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. మొత్తం 4 రాత్రులు/5 రోజులు సాగే ఈ టూర్ ఫిబ్రవరి 16న బెంగళూరు నుండి మొదలై ప్రతి గురువారం అందుబాటులో ఉండనుంది. ఆసక్తికల వారు వెంటనే ఐఆర్సీటీసీని (IRCTC Tour Packages) సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మూడు పర్యాటక ప్రాంతాలను సందర్శించవ్చు. (Photo Credit: Unsplash)
Samayam Telugu irctc tour package from banglore to kanyakumari rameshwaram madurai
IRCTC South India Tour: ఐఆర్సీటీసీ దక్షిణ భారత టూర్ ప్యాకేజీ.. ఎప్పుడంటే..!


ప్యాకేజీ పేరు, ధరలు..

ఈ ప్యాకేజీ పేరు డివైన్ తమిళనాడు ప్యాకేజీ. ఈ ప్యాకేజీ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. కంఫర్ట్ క్లాస్ కింద ఒక్కరు వెళ్లాలనుకుంటే రూ.26,360 కాగా, డబుల్ షేరింగ్‌లో రూ.14,400, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.11,040గా వెల్లడించింది. చిన్నపిల్లలకు విత్ బెడ్ రూ.8,400, వితౌట్ బెడ్ రూ.7,380గా పేర్కొంది. అదే స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కరికి రూ.24,830 కాగా, డబుల్ షేరింగ్‌లో రూ.12,870, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.9,510గా వివరించారు. ఇక చిన్నపిల్లలకు విత్ బెడ్ రూ.6,870 కాగా వితౌట్ బెడ్ రూ.5,860గా స్పష్టం చేశారు. (Photo Credit: Unsplash)

కన్యాకుమారి సందర్శన..

ఈ టూర్ ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నాగర్‌కోయిల్ జంక్షన్‌లో ట్రైన్ దిగుతారు. అక్కడ మిమ్మల్ని టూర్ ఆపరేటర్‌ రిసీవ్ చేసుకొని కన్యాకుమారిలోని హోటల్‌కు తీసుకెళతారు. రీఫ్రెష్ అయ్యాక స్థానికంగా ఉండే కుమారి అమ్మన్ టెంపుల్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్లూర్ స్టాచ్యూ, గాంధీ మెమోరియల్, సన్‌సెట్ పాయింట్, వాక్స్ మ్యూజియాలను సందర్శిస్తారు. (Photo Credit: Unsplash)

రామేశ్వరం పర్యటన..

ఇక మరుసటి రోజు తెల్లవారుజామున సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి అప్పుడే ఉదయించే సూర్యుడిని చూడొచ్చు. అనంతరం అల్పాహారం చేశాక మీరు అక్కడి నుండి రామేశ్వరానికి బయలుదేరతారు. మార్గ మధ్యలో తిరచెందర్ సందర్శిస్తారు. రామేశ్వరం చేరుకున్నాక హోటల్‌లో బస చేసి సాయంత్రం స్థానికంగా ఉండే ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాతి రోజు ఉదయం రామనాథస్వామి టెంపుల్, రామర్పదమ్ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం చూస్తారు. (Photo Credit: Unsplash)

మధురై వీక్షణ..

చివరి రోజు రామేశ్వరం నుండి బయలుదేరి మధురై బయలుదేరి అక్కడున్న సందర్శనీయ ప్రాంతాలను చూస్తారు. అందులో తిరుపురన్ కుంద్రమ్ మురుగన్ ఆలయం, తిరమల్లై నాయకర్ మహాల్, మధుర మీనాక్షి టెంపుల్ ప్రధానంగా చూస్తారు. అనంతరం మిమ్మల్ని రాత్రి 8 గంటలకు మధురై రైల్వేస్టేషన్‌లో వదిలేస్తారు. అక్కడి నుండి రాత్రి 11:50 గంటలకు బెంగళూరు వెళ్లే రైలులో తిరుగుపయనమవుతారు. దీంతో మీ టూర్ పూర్తవుతుంది. (Photo Credit: Unsplash)

ప్యాకేజీలో ఉండేవి..

ట్రైన్ జర్నీ అప్ అండ్ డౌన్. కంఫర్ట్ క్లాస్ వారికి 3ACలో ప్రయాణం, స్టాండర్డ్ క్లాస్ వారికి స్లీపర్ క్లాస్ ప్రయాణం. రామేశ్వరం, కన్యాకుమారిలో ఒక్కో రాత్రి హోటల్‌లో విడిది. రోజూ ఉదయం హోటల్స్‌లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. తిరగడానికి ప్రత్యేకమైన వాహనం ఏర్పాటు. అన్ని సందర్శనీయ ప్రాంతాలను చూపిస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అందులోనే టోల్, పార్కింగ్ ఫీజులు కూడా ఉంటాయి. (Photo Credit: Unsplash)

ప్యాకేజీలో ఉండనివి..

వ్యక్తిగత ఖర్చులైన వాటర్ బాటిల్స్, లాండ్రీ వంటివి. పైన చెప్పని వాటి సేవలు ఏది కావాలన్నా అదనంగా చెల్లించుకోవాలి. సందర్శనీయ ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లతో పాటు కెమెరాల టికెట్లు కూడా మీరే చూసుకోవాలి. ఇక రోజు మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాలు ప్యాకేజీలో ఉండవు. టూర్ గైడ్‌కి కూడా చెల్లించుకోవాలి. ఇవన్నీ ప్యాకేజీలో ఉండవు. మరింత స్పష్టమైన సమాచారం కోసం ఐఆర్సీటీసీని సంప్రదించడం మంచిది. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.