యాప్నగరం

Irctc Alleppey, Munnar Package: అల్లెప్పీ, మున్నార్ టూర్ ప్యాకేజీ.. వచ్చే వారం నుంచే పర్యటన..!

ఐఆర్సీటీసీ అల్లెప్పీ, మున్నార్ ప్యాకేజీ (IRCTC Alleppey, Munnar Package) అందిస్తోంది. ఆసక్తిగల ప్రయాణికులు ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు తెలుసుకొని టూర్‌కు ప్లాన్ చేసుకోవచ్చు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 7 Mar 2023, 4:19 pm
కేరళలోని (Kerala tour) టాప్‌మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో అలెప్పీ, మున్నార్ (IRCTC Alleppey, Munnar Package) ముందుంటాయి. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లాలని చాలా మంది ఆశ పడుతుంటారు. మున్నార్ అందమైన హిల్‌స్టేషన్ కాగా, అల్లెప్పీ అద్భుతమైన తీర ప్రాంతం. ఈ రెండూ కేరళలో మంచి పర్యాటక ప్రదేశాలు. దీంతో ఇక్కడికి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికోసమే ఐఆర్సీటీసీ గొప్ప ప్యాకేజీ తీసుకొచ్చింది. మొత్తం 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆ రెండు ప్రదేశాల్లోని అన్ని సందర్శనీయ స్థలాలను చూపించనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)
Samayam Telugu plan your alleppey and munnar trip with irctc package
Irctc Alleppey, Munnar Package: అల్లెప్పీ, మున్నార్ టూర్ ప్యాకేజీ.. వచ్చే వారం నుంచే పర్యటన..!


​సికింద్రాబాద్ నుండి మొదలై..

ఈ ప్యాకేజీ హైదరాబాద్ వాసులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. మార్చి 14న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో పర్యటకులు బయలుదేరుతారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఎర్నాకుళం రైల్వే‌స్టేష‌న్‌కు చేరుకొని అక్కడి నుండి మున్నార్‌కు చేరుకుంటారు. ఆరోజు విశ్రాంతి తీసుకొని తర్వాతి రోజు నుండి విహరించడం మొదలెడతారు. (Photo Credit: Unsplash)

Also Read: International Yoga Festival: అంతర్జాతీయ యోగా ఫెస్టివల్.. ఆసక్తి ఉంటే మీరూ వెళ్లి నేర్చుకోవచ్చు..!

మున్నార్‌లో చూసేవి ఇవి..

మూడో రోజు ఉదయం మున్నార్‌లో ఉండే సందర్శనీయ స్థలాలను చూస్తారు. మొదట ఎరవికుళం నేషనల్ పార్క్‌ను చూశాక తర్వాత మెట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్ సందర్శిస్తారు. అనంతరం హోటల్‌కు చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. (Photo Credit: Unsplash)

Also Read: IRCTC North East Tour: ఐఆర్సీటీసీ నార్త్ ఈస్ట్ ట్రిప్.. 15 రోజుల అద్భుతమైన యాత్ర..

​అల్లెప్పీ హౌస్‌బోట్‌ విహారం..

నాలుగోరోజు ఉదయం నిద్రలేవగానే ప్రెషప్ అయ్యాక అల్పాహారం తిని నేరుగా అల్లెప్పీకి బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో కాసేపు విశ్రాంతి పొందాక అనంతరం అక్కడ బ్యాక్ వాటర్స్‌లోని హౌస్‌ బోట్‌లో విహరించడానికి వెళతారు. అయితే, ఇది సొంత ఖర్చులతో చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యాకేజీలో భాగం కాదు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం ఎర్నాకుళం బయలుదేరుతారు. అక్కడి నుండి ఉదయం 11:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుముఖం పడతారు. దాంతో టూర్ పూర్తవుతుంది. (Photo Credit: Unsplash)

Also Read: Rishikesh Trip: ఈ ఫొటోలు చూస్తే రిషికేశ్ ట్రిప్ ప్లాన్ చేసుకోకుండా ఉండరు.. ఒకసారి మీరే చూడండి..!

​ప్యాకేజీ వివరాలు చూడండి..

ఈ ప్యాకేజీ మార్చి 14 నుండి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంది. దీంతో మీరు ఈ వారం కాకపోతే తర్వాత అయినా బుక్ చేసుకునే వీలుంది. ఇది కంఫర్ట్, స్టాండర్డ్ క్లాసుల్లో అందుబాటులో ఉండటంతో మీరు 3AC లేదా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. మీరు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ప్రయాణం సాగుతుంది. (Photo Credit: Unsplash)

Unique Holi Celebrations: సాంగ్లా వ్యాలీలో యూనిక్ హోలీ సెలబ్రేషన్స్.. అదెక్కడో తెలుసా?

ధరలైతే ఇలా ఉన్నాయి..

మీరు కంఫర్ట్ క్లాస్ ఎంచుకుంటే 1 నుండి 3 ప్రయాణికులకు సింగిల్ షేరింగ్‌లో రూ.31,970గా వెల్లడించగా డబుల్ షేరింగ్‌కు రూ.18,460, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,980 పేర్కొన్నారు. అదే 4 నుండి 6 ప్రయాణికులు ఉంటే డబుల్ షేరింగ్‌లో రూ. 16,930గా, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,680గా వెల్లడించారు. అదే స్టాండర్డ్ క్లాస్ ఎంచుకుంటే 1 నుండి 3 ప్రయాణికులకు సింగిల్ షేరింగ్‌లో 29,260, డబుల్ షేరింగ్‌లో రూ.15,750, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.12,270గా వివరించారు. ఇక 4 నుండి 6 ప్రయాణికులు ఉంటే డబుల్ షేరింగ్‌లో రూ.14,220, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.11,980గా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ని సందర్శించడం మంచిది. (Photo Credit: Unsplash)

Also Read: Kolkata: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.