యాప్నగరం

Things not to do in Thailand: థాయ్‌లాండ్‌ గురించి ఈ విషయాలు ఎవరూ చెప్పరు.. మీరు తెలుసుకోవడమే మంచిది!

థాయ్లాండ్ (Things not to do in Thailand) చాలా అందమైన, అద్భుతమైన అంతర్జాతీయ పర్యాటక ప్రదేశం. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు. అలాంటి చోట చేయకూడని పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 20 Jan 2023, 5:50 pm
దక్షిణాసియాలోని అందమైన దేశాల్లో థాయ్లాండ్ (Thailand Trip) ఒకటి. ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వచ్చి సేద తీరుతుంటారు. దీంతో ఏడాదిలో ఎప్పుడు వెళ్లినా ఆ దేశమంతా విపరీతమైన రద్దీతో ఉంటుంది. థాయ్లాండ్ అంటేనే పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపును సాధించింది. అందుకే అక్కడికి హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది విదేశీ టూరిస్టులు వస్తుంటారు. అయితే, అక్కడికి టూరిస్టులుగా వెళ్లినవారు కొన్ని పనులు చేయకూడదు (Things not to do in Thailand). అవెంటో తెలుసుకోకపోతే మీరు అక్కడికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికన్నా అక్కడ ఏమేం చేయకూడదో ముందే తెలుసుకోవడం ఉత్తమం. (Photo Credit: Unsplash)
Samayam Telugu things that you should not do when visiting thailand
Things not to do in Thailand: థాయ్‌లాండ్‌ గురించి ఈ విషయాలు ఎవరూ చెప్పరు.. మీరు తెలుసుకోవడమే మంచిది!



అక్కడ తల పట్టుకోవద్దు..

థాయ్లాండ్లో పర్యాటకులుగా వెళ్లినవారు పొరపాటున కూడా ఆ దేశ పౌరుల తలను ముట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్లు తలను పవిత్రమైన శరీర భాగంగా భావిస్తారు. అలా ఎవరైనా తమ తలను ముట్టుకుంటే అవమానంగా భావిస్తారు. దీంతో మీ మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకునే ప్రమాదం ఉంటుంది. (Photo Credit: Unsplash)
Also Read: Madhya Pradesh Trip: మధ్య ప్రదేశ్ ట్రిప్.. అక్కడ ఇలాంటి పర్యాటక అందాలు చూడొచ్చా..?

సన్యాసులను అస్సలు ముట్టుకోవద్దు..

అలాగే థాయ్లాండ్లో బౌద్ధ మతస్థులు అధికంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అక్కడ బౌద్ధ మత సన్యాసులు కూడా చాలా మందే ఉంటారు. అలాంటప్పుడు మీరు ఎక్కడైనా వారిని చూస్తే వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించడం, పొరపాటున తాకడం వంటివి చేయొద్దు. ఎందుకంటే ఆ సన్యాసులు తాము చాలా పవిత్రులమని భావిస్తారు.(Photo Credit: Unsplash)
Also Read: Unique Villages in India: ఇవి అరుదైన గ్రామాలు గురూ.. వాటి గురించి తెలిస్తే వెళ్లకుండా ఉండలేరు!

అలాంటి వ్యక్తులతో జాగ్రత్త..

అలాగే డ్రగ్స్ కలిగి ఉండటం అనేది థాయ్లాండ్లోనే కాకుండా ఏ దేశంలోనైనా తీవ్ర నేరంగానే పరిగణిస్తారు. ఇక్కడ డ్రగ్స్ మాఫియా ప్రదేశాలు చాలానే ఉంటాయి. దీంతో మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే తెలియని వారితో కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం బెటర్. (Photo Credit: Unsplash)
Also Read: Republic Day Trips: హైదరాబాద్ వాసులు రిపబ్లిక్ డే వీకెండ్ ట్రిప్ వెళ్లాలనుకుంటే ఈ 5 డెస్టినేషన్లను ఎంచుకోవచ్చు..!

పాస్‌పోర్ట్‌ని ఎవరికీ ఇవ్వద్దు..

ఒకవేళ మీరు థాయ్లాండ్లో ఏదైనా బైక్ లేదా కార్ని అద్దెకు తీసుకున్నప్పుడు ట్రావెల్ ఏజెంట్లు సేఫ్టీ కోసం మీ పాస్పోర్ట్ను ఇవ్వమంటే అస్సలు ఇవ్వకండి. అదెంతో ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి వాళ్లు మీ పాస్పోర్ట్తో ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాస్పోర్ట్ని ఇతరులకు ఇవ్వొద్దు. (Photo Credit: Unsplash)
Also Read: Travel With Friends: స్నేహితులతో చెక్కేయాలంటే ఈ అందమైన హిల్స్టేషన్లకు ప్లాన్ చేయండి..!

ఒల్లు కనేబడే బట్టలు వేయొద్దు..

థాయ్లాండ్ అంటేనే పర్యాటక ప్రదేశం. దీంతో అక్కడ ఎలాగైనా తిరగొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ దేశంలో మీరు ఎక్కడపడితే అక్కడ మీ శరీర భాగాలు కనిపించేలా దుస్తులు ధరించొద్దు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో, దేవాలయ ప్రాంగాణాల్లో. కేవలం బీచ్ల వద్దే మీకిష్టమొచ్చిన దుస్తులు ధరించొచ్చు. మిగతా చోట్ల కురచ దుస్తులు ధరిస్తే అక్కడి వారికి అస్సలు నచ్చదు. (Photo Credit: Unsplash)
Also Read: IRCTC Vietnam Tour: ఐఆర్సీటీసీ వియత్నాం టూర్.. ధరెంతో తెలిస్తే సీట్ బుక్ చేసుకుంటారు..!

ఆ పనులకోసం వెళితే జాగ్రత్త..

ఇక యువతలో చాలా మంది థాయ్లాండ్ అంటేనే ఇతర సుఖాలకోసం అని భావిస్తారు. దీంతో అక్కడికి వెళ్లినప్పుడు అలాంటి ప్రదేశాల కోసం కూడా బాగా వెతుకులాడుతారు. కానీ, మీరు ఎవరైనా అలాంటి వాటి కోసం వెళితే జాగ్రత్త. ఎందుకంటే ఆ ముసుగులో అవతలి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు మిమ్మల్ని బెదిరించి భారీ మొత్తం గుంజేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. (Photo Credit: Unsplash)
Also Read: Airplane Emergency Exit: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలుసా..?
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.