యాప్నగరం

Jaisalmer: జైసల్మేర్ టూరిస్టులు ఇకపై హెలికాఫ్టర్‌ రైడ్‌ ఆస్వాదించొచ్చు..!

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను (Jaisalmer) సందర్శించాలనుకునేవారికి గొప్ప అవకాశం దొరికింది. ఇటీవల అక్కడ హెలికాఫ్టర్ రైడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో టూరిస్టులు ఆ సేవలను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 29 Dec 2022, 7:12 pm
జైసల్మేర్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు అద్భుతమైన అవకాశం దక్కింది. రాజస్థాన్ టూరిజం డెవెలప్మెంట్ కార్పొరేషన్ హెలికాఫ్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై అక్కడికి వెళ్లేవారు జైసల్మేర్ అందాలను ఆకాశం నుంచి డేగ కళ్లతో చూడొచ్చు. రాజస్థాన్‌లోని సామ్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్‌తో రాజస్థాన్ టూరిజం డెవెలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది.
Samayam Telugu helicopoter-thumb


మైనారిటీ వ్యవహారాల మంత్రి సలేహ్ మహ్మద్, పర్యాటక శాఖ సహాయ మంత్రి మురారీ లాల్ మీనా, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్, జిల్లా కలెక్టర్ టీనా దాబీ ఇటీవల ఈ హెలికాఫ్టర్ రైడ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ విషయంపై మాట్లాడిన కలెక్టర్.. హెలికాప్టర్ రైడ్ సేవల ద్వారా జైసల్మేర్ పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడ పారాసైలింగ్, పారామోటరింగ్‌ వంటి జాయ్‌రైడ్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు హెలికాప్టర్ రైడ్‌లు కూడా టూరిస్ట్ ప్యాకేజీలోనే ఆస్వాదించొచ్చని చెప్పారు.

కాగా, ప్రస్తుతానికి జైసల్మేర్‌లో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారని తెలిసింది. భవిష్యత్తులో ఇదే క్రమంలో మరిన్ని పర్యాటక ప్రాంతాలను కలిపి ఒక టూరిస్ట్ సర్క్యూట్‌‌గా హెలికాఫ్టర్ రైడ్ సేవలను అనుసంధానించే ప్రతిష్టాత్మక పథకం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పర్యాటకులు తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలను సందర్శించగలిగేలా, మతపరమైన ప్రదేశాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, వారసత్వ కట్టడాల ఆధారంగా ఆ పర్యాటక సర్క్యూట్ ఉంటుందని సమాచారం.

ఈ హెలికాఫ్టర్ రైడ్ సేవల గురించి మరింత మాట్లాడిన రాజస్థాన్ టూరిజం డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మేంద్ర రాథోడ్.. ఒక్క పర్యాటకుడికి కనీస టిక్కెట్ ధర రూ.7,000గా నిర్ణయించారని చెప్పారు. రోజూ 200 మంది పర్యాటకులు 40 ట్రిప్పుల ద్వారా ఈ సేవలను పొందగలుగుతారని వివరించారు. ఈ జాయ్‌రైడ్ 5 నిమిషాలు, 15 నిమిషాలు అనే రెండు స్లాట్‌లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.