యాప్నగరం

Cherry Blossom Festival: చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ చూడాలంటే జపాన్ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇక్కడే చూడొచ్చు

ఏటా షిల్లాంగ్‌లో (Shillong) నిర్వహించే చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ మరోసారి పర్యాటకులను ఆకర్షించడానికి సిద్ధమైంది. ఈనెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు పూర్తిస్థాయిలో జరగనుంది. దీంతో మనం చెర్రీ బ్లాసమ్ అందాలు చూడాలంటే జపాన్ వెళ్లాల్సిన అవసరం లేదు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 11 Nov 2022, 12:18 am
కరోనా కారణంగా గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయిన ‘షిల్లాంగ్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’ ఈ సంవత్సరం ఘనంగా జరుపుకోడానికి సిద్ధమైంది. నవంబర్ 23 నుండి 26 వరకు నాలుగు రోజుల పాటు ఈ అందమైన ఈవెంట్ జరగనుంది. అలాగే నవంబర్ 21 నుండి 23 వరకు షిల్లాంగ్ లిటరరీ ఫెస్టివల్ కూడా జరగనుంది. దీంతో మీరు వారం రోజులు షిల్లాంగ్‌ను సందర్శించడానికి సిద్ధమవ్వచ్చు.
Samayam Telugu shillong


చెర్రీ పువ్వులు అంటే ఎవరికైనా ముందుగా జపానే గుర్తుకు వస్తుంది. కానీ, మన షిల్లాంగ్‌లోనూ నవంబర్‌లో అలాంటి అందమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో నగరంలో ఎటు చూసినా గులాబీ-తెలుపు పువ్వులతో అందమైన పరిసరాలే కనిపిస్తాయి. దీంతో ఈ ఫెస్టివల్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వెళ్తారు. సహజంగా ఈ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ పోలో గ్రౌండ్‌లో జరుగుతుంది. అక్కడ ఉండే వార్డ్స్ లేక్ కూడా ఈ వేడుకలో భాగమై కొత్త అందాలను సంతరించుకుంటుంది.

ఈ పోలో గ్రౌండ్ అనేది షిల్లాంగ్ గోల్ఫ్ కోర్స్ నుండి నడిచి వెళ్లేంత దూరంలో ఉంటుంది. దీన్ని గోల్ఫ్ లింక్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో షిల్లాంగ్‌లోని ప్రతిచోటా పైన్ చెట్లు, చెర్రీ పువ్వులు అందంగా ముస్తాబై ప్రతి ఒక్కర్నీ అలరిస్తాయి. అలాగే ఈ ఫెస్టివల్‌లో ఆహారం, స్థానిక వైన్, మంచి సంగీతం ఆస్వాదించొచ్చు. మరోవైపు స్థానిక సంస్కృతిని తెలుసుకోవడం, స్థానిక ప్రజలతో మాట్లాడటానికి ఇదో మంచి అవకాశం.

గమనిక: ఈ ఫెస్టివల్‌కి వెళ్లేవారు ఒక్కో రోజు టిక్కెట్‌లను విడిగా కొనుగోలు చేయాలి. జనరల్ లేదా GA టిక్కెట్లు ఒక్కొక్కరికి రూ.899; VIP టిక్కెట్లు ఒక్కొక్కరికి రూ.5000గా నిర్ణయించారు.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.