యాప్నగరం

రండి, పర్యటించండి.. రూ.7 వేలు పొందండి!

ఏదైనా పర్యటక ప్రాంతానికి వెళ్తే చేతి చమురు వదులుతుంది. కానీ, అక్కడ మాత్రం పైసా చెల్లించక్కర్లేదు. పైగా, వాళ్లే మనకు రూ.7 వేలు ఇస్తారు. బాగుంది కదూ ఆఫర్!

Samayam Telugu 21 Jan 2019, 9:19 pm

ప్రధానాంశాలు:

  • ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారే తిరిగి మీకు 100 డాలర్లు (సుమారు రూ.7వేలు) ఇస్తారట.
  • ఈ అవకాశం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 1547984773-slo_california_afp
‘‘రండి బాబు రండి.. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మా ప్రాంతంలో పర్యటించండి. ఉచితంగా బస చేయండి’’ అని దండోరా వేసి మరీ పిలుస్తున్నారు. అంతే కాదండోయ్.. ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారే తిరిగి మీకు 100 డాలర్లు (సుమారు రూ.7వేలు) ఇస్తారట. ఈ ఆఫర్ ఏదో బాగుందే ఓసారి వెళ్లొస్తే పోలే అనుకుంటున్నారా?
అయితే, అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో గల సాన్ లూయిస్ ఒబిస్పో‌కు వెళ్లాల్సిందే. ఎస్ఎల్వో (SLO)గా పేరొందిన ఈ ప్రాంతం లాస్ ఏంజిల్స్, సాన్‌ ఫ్రాన్సిస్కో నగరాలకు మధ్యలో ఉంది. 2011లో జరిగిన ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో అమెరికాలోనే అత్యంత సంతోషకరమైన పర్యాటక ప్రాంతంగా ఎస్‌ఎల్వో గుర్తింపుపొందింది.

పర్యటకులను ఆకట్టుకోవడంలో భాగంగా రెండు రాత్రులు అక్కడ బస చేసేవారికి 100 డాలర్లు ఇస్తామని ప్రకటించింది. ఈ అవకాశం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన అన్నిరకాల ఆధారాలు చూపిస్తేనే ఈ నజరానా ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ మధ్య కాలంలో అమెరికా పర్యటన ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.