యాప్నగరం

టైఫూన్ బీభత్సం.. జపాన్ ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత

టైఫూన్ జేబీ ధాటికి జపాన్‌లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. విమాన రైలు సర్వీసులు రద్దయ్యాయి.

Samayam Telugu 6 Sep 2018, 3:56 pm
టైఫూన్ జేబి బీభత్సానికి జపాన్ అతలాకుతలమైంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా జేబి విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 11 మంది మరణించగా, 600 మంది గాయపడ్డారు. భీకర గాలుల ధాటికి వాహనాల్లో గాల్లో ఎగిరిపడి భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జపాన్ విమానాశ్రయాలను సైతం మూసివేశారు.
Samayam Telugu Untitled1a


జపాన్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడ చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు సుమారు 129 మైళ్ల వేగంతో విరుచుకుపడిన టైఫూన్ వల్ల జపాన్ పశ్చిమ ప్రాంతంలోని క్యోటో, ఒసాకా తదితర నగరాలు అతలాకుతలమయ్యాయి.

టైఫూన్ ధాటికి జపాన్‌లో రవాణా వ్యవస్థ స్తంభించింది. విమాన సర్వీసులు, రైళ్లు, ఫెర్రీలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు నిలిచిపోయింది. కాన్సయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్‌వేలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ చిక్కుకున్న 5 వేల మంది ప్రయాణికులను హైస్పీడ్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

క్యోటోలోని రైల్వే స్టేషన్లో పైకప్పు ఎగిరిపడటంతో రైలు సేవలు నిలిచిపోయాయి. బుల్లెట్ రైలు సేవలను పూర్తిగా నిలిపేశారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఇప్పట్లో జపాన్ వెళ్లకపోవడమే మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.