యాప్నగరం

మొసళ్ల సాగు.. అక్కడ అదే జీవనాధారం!

ఔను, ఆ దేశంలో రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నట్లుగా చెరువుల్లో మొసళ్లను పెంచుతున్నారు. మొసళ్లను సాగు చేయడం ఏమిటీ? ప్రమాదకరం కదా అనేగా మీ ప్రశ్న.

Samayam Telugu 4 Jul 2017, 6:12 pm
ను, ఆ దేశంలో రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నట్లుగా చెరువుల్లో మొసళ్లను పెంచుతున్నారు. మొసళ్లను సాగు చేయడం ఏమిటీ? ప్రమాదకరం కదా అనేగా మీ ప్రశ్న. వాటి నుంచి మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, వాటికే మనుషుల నుంచి ప్రమాదం. ఎందుకంటే, అలా పెంచుతున్న మొసళ్లను దారుణంగా వధించి.. వాటి చర్మంతో తోలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వాటిని చూసేందుకు పర్యటకులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Samayam Telugu worlds biggest crocodile farms equipped with slaughterhouses and tanneries to produce luxury products
మొసళ్ల సాగు.. అక్కడ అదే జీవనాధారం!


థాయ్‌లాండ్‌‌కు వెళ్తే.. అక్కడ చెరువుల్లో మొసళ్లు నోరు తెరిచి ఆహ్వానం పలుకుతాయి. ఆ దేశంలో దాదాపు వెయ్యికి పైగా మొసళ్ల సాగు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 1.2 మిలియన్ల మొసళ్లను పెంచుతున్నారు. వాటి తోలు వలిచి ఖరీదైన లెదర్ వస్తువులు తయారు చేస్తున్నారు. అంతేకాదు, వాటి మాంసానికి కూడా ఆ దేశంలో మాంచి డిమాండు ఉంది. వాటి రక్తాన్ని ఔషదాల్లో వాడుతున్నారు.

ఈ లెదర్ ఉత్పత్తులకు చైనాలో భారీ డిమాండు ఉంది. వీటి ఎగుమతి కూడా ఇక్కడ చట్టబద్దంగా సాగుతోంది. దీంతో, థాయ్‌లాండ్‌లో చాలా మంది దీన్నే జీవనాధారంగా మలచుకున్నారు. వీటిని నేరుగా కొనుగోలు చేసేందుకు చైనా నుంచి నిత్యం వేల సంఖ్యలో పర్యటకులు వస్తారంటే మొసలి చర్మం ఉత్పత్తులకు ఎంత డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాలు చూస్తే.. అక్కడ మొసళ్ల పెంపకం, వాటితో వ్యాపారం... ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
1. థాయ్‌లాండ్‌లోని ఓ జూలో కోడి తలలు తింటున్న మొసళ్లు

2. అప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చిన మొసలి పిల్ల

3. థాయ్‌లాండ్‌లోని శ్రీ ఆయుథయా క్రోకోడైల్ ఫారంలో మొసళ్ల సందడి

4. మొసళ్లకు ఆహారం ఇస్తున్న రైతులు

5. భవిష్యత్తులో ఇవి కూడా లెదర్ బ్యాగ్గులుగా మారిపోతాయి

6. మొసళ్ల చర్మంతో తయారైన ఉత్పత్తులకు పాలిష్ చేస్తున్న సిబ్బంది

7. బ్యాంకాక్‌లో మొసలి మాంసాన్ని ముక్కలు చేస్తున్న సిబ్బంది

8. అమ్మకానికి సిద్ధం చేసిన మొసలి చర్మాలు

9. మొసళ్ల గుడ్లను ఇలా భద్రపరుస్తారు

10. గుడ్డు నుంచి మొసలిని బయటకు తీస్తున్న సిబ్బంది

11. గుడ్ల నుంచి బయటకు వచ్చిన మొసలి పిల్లలను ఇలా స్వచ్ఛమైన నీటిలో ఉంచుతారు.

12. కోడి తింటున్న మొసలి

13. జూలో మొసలి తలలో తలపెడుతూ ప్రదర్శన....

14. ఆరబెట్టిన మొసలి చర్మాలు

15. మొసలి చర్మాన్ని పరీక్షగా చూస్తున్న చైనా పర్యటకులు

16. మొసలి చర్మంతో తయారు చేసిన జాకెట్‌ను ధరిస్తున్న చైనా టూరిస్ట్

17. వీటి మధ్యలో అడుగుపెడితే.. ఇక అంతే..!


Photos: Reuters/IndiaTimes

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.