యాప్నగరం

7 Arts Sarayu: సరయు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో షాకింగ్ ట్విస్ట్.. దమ్ దమ్ అంటే ఇదీ!! సరయు సంచలనం

బిగ్ బాస్‌ని దమ్ దమ్ చేస్తానని హౌస్‌లోకి వెళ్లిన సరయు.. వారంలోనే ఇంటి ముఖం పట్టింది. అయితే తాను బయట ఉన్నా లోపల ఉన్నా బిగ్ బాస్‌ని దమ్ దమ్ చేయడం మాత్రం గ్యారంటీ అంటూ షాకింగ్ వీడియోను విడుదల చేసింది.

Samayam Telugu 17 Sep 2021, 6:02 pm
బిగ్ బాస్ తనకి అన్యాయం చేశాడంటూ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కన్నీళ్లు పెట్టుకుంది సరయు. హౌస్‌లో ఏం జరిగింది.. తనపై బిగ్ బాస్ ఎలాంటి వివక్ష చూపించారో పూసగుచ్చినట్టు ఆధారాలతో సహా చెప్తూ వీడియో విడుదల చేసింది సరయు.
Samayam Telugu సరయు వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Sarayu Wild Card


అయితే తొలివారంలో ఎలిమినేట్ అయిన సరయు.. మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి జరిగిన అవమానం చాలని.. బిగ్ బాస్ పిలిచినా నేను వెళ్లనంటూ కుండబద్దలు కొట్టేసింది సరయు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ని దమ్ దమ్ చేస్తానన్న మాటను బయటనుంచి చేసి చూపిస్తా అని సవాల్ చేసింది సరయు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను బిగ్ బాస్‌కే కాదు.. ఎక్కడికి వెళ్లినా నాలాగ నేను మాత్రమే ఉంటాను. ఫేక్ చేస్తే ఎన్నాళ్లు మాత్రం చేయగలను.. ఏదో రోజు రియాలిటీ బయటపడుతుంది కదా.. అప్పుడు జనానికి తెలియదా?? నేను బిగ్ బాస్‌కి అన్ ఫిట్ అని తేలిపోయింది.. అక్కడికి వెళ్లాలంటే ఫేక్‌గా ఉండాలి.. ఫేక్‌గా గొడవలు చేయాలి.. అది నేను చేయలేను.

మళ్లీ నేను వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లినా వారంలోనే తిరిగి వచ్చేస్తా.. ఎందుకంటే నేను ఫేక్‌గా ఉండలేను.. కంటెంట్ కోసం నటించలేను. నిజంగా నన్ను బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకుంటే అది ఆయన గొప్పతనం. కానీ ఈసారి కూడా నాకు స్క్రీన్ స్పేస్ ఇస్తారనే గ్యారంటీ లేదు. నేను కొంతవరకే మనుషుల్ని నమ్మగలను.. ఎందుకో నాకు బిగ్ బాస్‌పై నమ్మకం కలగడం లేదు.. నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించినా నేను వెళ్లదల్చుకోలేదు. బిగ్ బాస్ పిలిచినా వెళ్లను.. గౌరవం ఇస్తా కానీ నేను ఆ షోకి అన్ ఫిట్.. లోపలికి వెళ్లి బిగ్ బాస్‌ని దమ్ దమ్ చేస్తానన్నా కదా.. ఇప్పుడు చూడండి.. బయటకు వచ్చాక దమ్ దమ్ చేస్తా.. అక్కడ దమ్ దమ్ చేయడానికి నాకు స్క్రీన్ స్పేస్ లభించలేదు. బయట నుంచి ఎలా దమ్ దమ్ చేస్తానో చూపిస్తా.. బరాబర్ చేస్తా.. ఎలా చేస్తానన్నది త్వరలోనే చూస్తారంటూ బిగ్ బాస్‌కి సవాల్ విసిరింది సరయు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.