యాప్నగరం

పరారీలో ఉన్న వ్యక్తి బిగ్‌బాస్‌లో ప్రత్యక్షమైన వేళ!

బిగ్‌బాస్‌లో చిత్రి విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యే తమిళంలో ఇద్దరమ్మాయిలు లిప్ లాక్‌లు ఇచ్చుకుంటే.. మళయాళంలో తొలి రోజే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్త ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 25 Jun 2018, 5:18 pm
బిగ్‌బాస్ ప్రోగ్రాంను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ షోను అద్భుతంగా నడిపిస్తే.. రెండో సీజన్లో నాని ఇప్పుడిప్పుడే తన మార్క్ చూపిస్తున్నాడు. మొదటి సీజన్లో కంటెస్టెంట్స్ పెద్దగా గొడవలు పడకుండానే హౌస్‌లో హుందాగా ప్రవర్తించగా.. ప్రస్తుతం కొద్దిపాటి గొడవలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ మాత్రం దానికే మనం ఏదోలా ఫీలవుతుంటే.. పక్కన తమిళం, మళయాళం భాషల్లో వస్తున్న బిగ్ బాస్ షోలు మరో అడుగు ముందుకేశాయి.
Samayam Telugu bigg-boss-malyalam1


తమిళ బిగ్‌బాస్‌లో జనని అయ్య‌ర్, ఐశ్వర్య ద‌త్తా అనే ఇద్దరు కంటెస్టెంట్స్ లిప్ టు లిప్ కిస్ ఇటీవలే పెట్టుకోవడం సంచలనమైంది. తమిళ బిగ్ బాస్‌లో ఎప్పుడూ గొడవలే. ఇక మళయాళంలోనూ బిగ్ బాస్ తొలి సీజన్ ఆదివారం ప్రారంభమైంది. ఈ షోకు మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పారితోషికంగా అక్షరాలా రూ.12 కోట్లు ముట్టజెబుతున్నట్టు సమాచారం.

అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. మోహన్‌లాల్ కంటెస్టెంట్స్‌ను పిలుస్తూ.. సబుమన్ అనే వ్యక్తిని ఆహ్వానించారు. ఆయన్ను చూడగానే కేరళ జనాలు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే మనోడు కొన్నాళ్లుగా ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. ఎస్ఎఫ్ఐ లీడర్‌గా పని చేసిన సబు.. లసితా పలక్కల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిపై లింగ వివక్ష వ్యాఖ్యలు చేశాడు.

అసలే కేరళలో బీజేపీ, వామపక్షాల మధ్య ఉప్పునిప్పులా పరిస్థితులు ఉన్నాయి. దీంతో బీజేపీ వాళ్లు సబు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షం అయ్యాడు. దీంతో అతణ్ని షోకి ఎలా ఎంపిక చేస్తారని బిగ్ బాస్ నిర్వాహకుల మీద, ఆసియా నెట్ చానెల్ మీద జనాలు రుసరుసలు ఆడుతున్నారు. అతణ్ని షో నుంచి తప్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా బిగ్ బాస్ షో ఫస్ట్ రోజే మళయాళం జనాల్లోకి వెళ్లిపోయింది.

‘సీఎం గారూ.. మీరేమో సబు పరారీలో ఉన్నాడని అంటున్నాడు. తీరా చూస్తే అతడేమో బిగ్ బాస్ షోలో ప్రత్యక్షం అయ్యాడు. ఆసియా నెట్ చానెల్ యజమానిని అరెస్ట్ చేస్తారా’ అంటూ అతడిపై కేసు పెట్టిన లసితా పినరయి విజయన్‌ను డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.